Begin typing your search above and press return to search.

ఏపీపై కేసీఆర్ భారీ ఫోక‌స్‌.. ఆ రెండు సామాజిక వ‌ర్గాలే టార్గెట్‌

By:  Tupaki Desk   |   9 Oct 2022 6:04 AM GMT
ఏపీపై కేసీఆర్ భారీ ఫోక‌స్‌.. ఆ రెండు సామాజిక వ‌ర్గాలే టార్గెట్‌
X
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏం చేసినా..చాలా వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తారు. ఈ విష‌యంలో ఆయ‌న‌కు తిరుగులేదు. ఆయ‌న ప‌ట్టింద‌ల్లా ఇప్ప‌టి వ‌ర‌కు విఫ‌ల‌మైంది లేదు. ఒక‌నాడు.. టీఆర్ ఎస్ పార్టీ పెట్టిన‌ప్పుడు.. అనేక విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. ఆ పార్టీలో చేరేవారెవ‌రు? అంటూ.. దివంగ‌త వైఎస్ వంటివారు ఎగ‌తాళి చేశారు. అయినా.. మొక్క‌వోని దీక్ష‌తోటీఆర్ ఎస్‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్లారు. ఫ‌లితంగా అదే కాంగ్రెస్ నుంచి అనేక మంది టీఆర్ ఎస్ పంచ‌న చేరారు.

ఇప్పుడు కేసీఆర్ చేస్తున్న మ‌రో విప్ల‌వాత్మ‌క ప్ర‌యోగం.. బీఆర్ ఎస్‌. ప్ర‌స్తుతం ఉన్న టీఆర్ ఎస్‌ను ఆయ‌న భార‌త రాష్ట్ర స‌మితిగా మార్పు చేస్తూ.. జాతీయ‌స్థాయిలో త‌న గ‌ళం వినిపించాల‌ని.. నిర్ణ‌యించుకున్నారు. అయితే.. ఇప్పుడు కూడా.. ఆయ‌న ఒంట‌రిగానే ఉన్నార‌నే విశ్లేష‌ణ‌లు వ‌స్తున్నాయి. ఎందుకంటే.. పొరుగు రాష్ట్రాల‌ను క‌లుపుకొని వెళ్తున్నా.. ఆయ‌న‌తో స‌హ‌క‌రించేవారు.. ఎవ‌రున్నార‌నే చ‌ర్చ సాధార‌ణంగానే తెర‌మీదికివ‌చ్చింది. ఈ క్ర‌మంలో కేసీఆర్‌.. ఏపీపై ముఖ్యంగా సామాజిక వ‌ర్గాల గేలం వేస్తున్నారు.

వెలమ‌, రెడ్డి సామాజిక వ‌ర్గాల‌కు.. ఏపీలోని ఉత్త‌రాంధ్ర, రాయ‌ల‌సీమ జిల్లాలు ప్ర‌తీతి. ఇక్క‌డ రాజ‌కీయాలు చేస్తున్న‌ది.. చేస్తోంది కూడా ఈ రెండు సామాజిక వ‌ర్గాలే. దీంతో ఆయా వ‌ర్గాల‌ను త‌న‌వైపు తిప్పుకొనేందుకు కేసీఆర్ వ్యూహాత్మ‌కంగా పావులు క‌ద‌పాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు తెలుస్తోంది. ఉత్త‌రాంధ్ర‌లో కేసీఆర్ మూలాలు ఉన్నాయ‌నే చ‌ర్చ‌సాగుతోంది. ఈ క్ర‌మంలో ఆయ‌న‌కు అనుకూలంగా ఇక్క‌డి వాతావ‌ర‌ణం ఉంటుంద‌ని అంటున్నారు.

ఇక‌, సీమ‌లో ఎప్ప‌టి నుంచో త‌మ‌ను కూడా.. తెలంగాణ‌లో క‌లిపేయాల‌ని.. లేదా ప్ర‌త్యేక రాష్ట్రంగా చూడాల‌ని డిమాండ్ ఉంది. ఈ నేప‌థ్యంలో ఇక్క‌డి రెడ్ల‌ను కూడా.. కేసీఆర్ త‌న‌వైపు తిప్పుకొని.. వారి డిమాండ్ల‌పై సానుకూలంగా స్పందించే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. అదేస‌మ‌యంలో టీడీపీ, వైసీపీల్లోని.. అసంతృప్తుల‌ను.. వృద్ధ నేత‌ల‌ను కూడా కేసీఆర్ త‌న‌వైపు తిప్పుకొనే ప్ర‌య‌త్నం చేస్తే.. అది కూడా స‌క్సెస్ అవుతుంద‌ని అంటున్నారు. మొత్తానికి కేసీఆర్ ఈ రెండు సామాజ‌పిక వ‌ర్గాలే కేంద్రంగా ఏపీపై దృష్టి పెట్టార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.