Begin typing your search above and press return to search.
ఫ్లాష్ సర్వేతో షాకిస్తున్న కేసీఆర్
By: Tupaki Desk | 17 Sep 2018 6:02 AM GMTతెలంగాణ సీఎం కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళుతూ ఏకంగా 105మంది అభ్యర్థులను ప్రకటించేశారు. ఇందులో ప్రస్తుతం ఉన్న సిట్టింగ్ లందరికీ సీట్లు ఇచ్చేశారు. కొందరిపై తీవ్ర వ్యతిరేకత ఉన్నా సరే కేసీఆర్ టికెట్లు ఇచ్చేయడం దుమారం రేపింది. వారు ఓడిపోతారని ఇంటా బయటా విమర్శలు వ్యక్తమవుతున్నా కేసీఆర్ కు ఇంత ధైర్యం ఎలా వచ్చిందని అందరూ డౌట్ పడ్డారు. కానీ కేసీఆర్ ఐడియా మరోలా ఉంది.
105మంది అభ్యర్థులను ప్రకటించేసిన కేసీఆర్ తాజాగా తెలంగాణ రాష్ట్రంలోని నియోజకవర్గాల్లో ఫ్లాష్ సర్వే నిర్వహిస్తున్నారట.. గెలిచేవారు ఎవరు.? ఓడివారు ఎవరనేదానిపై పక్కాగా సమాచారం రాబడుతున్నారట.. దీన్ని బట్టి ఏఏ స్థానాలు మార్చాలో ఓ నిర్ణయానికి రాబోతున్నాడట. తెలంగాణ ఎన్నికల్లో వార్ వన్ సైడ్ గా ఉండాలని భావిస్తున్న కేసీఆర్ ఇందుకు బలమైన అభ్యర్థులే కీలకమని భావిస్తున్నారు. అందుకే ఇప్పుడు ప్రకటించిన 105 మందితోపాటు మిగతా 14 నియోజకవర్గాల్లో కూడా ఎవరు గెలుపు గుర్రాలనే దానిపై సర్వేతో తేల్చనున్నాడట.. సర్వేలో నెగెటివ్ ఫీడ్ బ్యాక్ వస్తే ఎమ్మెల్యే అభ్యర్థులను మార్చడానికి కేసీఆర్ సిద్ధమవుతున్నాడనే వార్త ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో కలకలం రేపుతోంది.
బీజేపీ అభ్యర్థులు గెలిచిన 5 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉప్పల్ కు సంబంధించి టీఆర్ ఎస్ అభ్యర్థిని కేసీఆర్ ఇప్పటికే ప్రకటించేశారు. ఇక మిగిలిన 4 స్థానాల్లో బలమైన వారి కోసం ఈ ఫ్లాష్ సర్వేను కేసీఆర్ ఉపయోగించుకుంటున్నాడట.. ఇక పీసీసీ చీఫ్ ఉత్తమ్ - ఆయన భార్య పద్మావతి గెలిచిన హుజూర్ నగర్ - కోదాడ నియోజకవర్గాల్లోనూ అభ్యర్థులను కేసీఆర్ ప్రకటించలేదు. కాంగ్రెస్ చీఫ్ కు షాకివ్వాలని కేసీఆర్ కృతనిశ్చయంతో ఉన్నారట.. ఉత్తమ్ ను ఓడిస్తే మొత్తం కాంగ్రెస్ పని ఖతమవుతుందని భావిస్తున్నారు. అందుకే ఫ్లాష్ సర్వే ద్వారా ఉత్తమ్ పై బలమైన అభ్యర్థిని బరిలోకి దింపాలని కేసీఆర్ యోచిస్తున్నారట..
ఇక టీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాలు ఐదింటిలో కూడా కేసీఆర్ అభ్యర్థులను పెండింగ్ లో ఉంచారు. ఇప్పటికే వరంగల్ తూర్పులో అనౌన్స్ చేయకపోవడంతో కొండా సురేఖ తిరుగుబావుటా ఎగురవేశారు. మిగతా నియోజకవర్గాల్లోనూ సర్వే రిపోర్ట్ పైనే కేసీఆర్ ఆధారపడ్డాడట.. దీంతో సర్వేలో తమపై పాజిటివ్ ఫీడ్ బ్యాక్ వస్తుందా రాదా అన్నదానిపై ఇప్పుడు టీఆర్ఎస్ అభ్యర్థులు తీవ్ర ఒత్తిడిలో ఉన్నట్టు సమాచారం.
మహాకూటమి సీట్ల పొత్తు.. అభ్యర్థుల ప్రకటనకు ముందే కేసీఆర్ ఆ 14 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించేందుకు రెడీ అయిపోతున్నారట.. దీంతో టీఆర్ ఎస్ ఫ్లాష్ సర్వే తమ కొంపులు ముంచుతుందా అని అందరూ టీఆర్ ఎస్ అభ్యర్థులు హడలి చస్తున్నారట.. చూడాలి మరి కేసీఆర్ ఏమేం మార్పులు తీసుకొస్తారో..?