Begin typing your search above and press return to search.
కొత్త సచివాలయంలో మంత్రివర్గ భేటీ.. ప్రత్యేకత ఇదే!
By: Tupaki Desk | 19 May 2023 8:34 AM GMTకొత్త సచివాలయంలో తొలి మంత్రివర్గ సమావేశం గురువారం జరిగింది. ఇక్కడో ప్రత్యేకత ఉంది. ప్రగతిభవన్ వేదికగా ఇప్పటికే ఎన్నో మంత్రివర్గ సమావేశాలు సాగాయి. కొన్ని సందర్భాల్లో మధ్యాహ్నం మొదలై రాత్రి పొద్దుపోయే వరకు సాగాయి.
కానీ.. కొత్త సచివాలయంలో నిర్వహించిన తొలి మంత్రివర్గ భేటీ మాత్రం మూడు గంటలకు పైగా.. నాలుగు గంటల్లోపు ముగియటం ఆసక్తికరమని చెప్పాలి. ఇంత స్వల్ప వ్యవధిలో మంత్రివర్గ సమావేశాన్ని ముగించటం ఇటీవల కాలంలో ఇదే తొలిసారిగా చెప్పాలి.
గులాబీ బాస్ మంత్రివర్గ సమావేశం అన్నంతనే గంటల తరబడి సాగుతుందన్న విషయం తెలిసిందే. మంత్రులు.. అధికారులు కూడా ఇదే విషయానికి ఫిక్సు అయిపోతారు. క్యాబినెట్ భేటీ ఎప్పుడు జరిగినా.. ఆఫ్టర్ లంచ్ తర్వాతే మొదలవుతుంది. చాలామంది ముఖ్యమంత్రులు ఉదయం 11 గంటలకు మొదలు పెట్టి లంచ్ టైంకు క్లోజ్ చేస్తారు. కేసీఆర్ మాత్రం అందుకు భిన్నం. ఆయన ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న ఈ తొమ్మిదేళ్లలో.. ఎప్పుడూ ఉదయాన్నే క్యాబినెట్ భేటీని నిర్వహించింది లేదు.
తాజా మంత్రివర్గ సమావేశాన్ని చూస్తే.. మధ్యామ్నం మూడు గంటలకు మొదలుపెట్టిన ఆయన సాయంత్రం 6.15 గంటలకు పూర్తి చేశారు. అంటే.. మూడుంబావు గంట మంత్రివర్గ సమావేశం సాగింది.
కేసీఆర్ సుదీర్ఘ మంత్రివర్గ సమావేశాలతో పోలిస్తే ఇది చాలా త్వరగా ముగిసిన క్యాబినెట్ భేటీగా చెప్పాలి. కొత్త సచివాలయంలో నిర్వహిస్తున్న తొలి మంత్రివర్గ సమావేశం ఎప్పటిలానే రాత్రి పొద్దుపోయే వరకు సా..గుతుందని భావించారు. అందుకు భిన్నంగా స్వల్వ వ్యవధిలోనే పూర్తి కావటం అధికారుల్ని విస్మయానికి గురి చేసింది.
ఈసారి మంత్రివర్గ సమావేశానికి మంత్రి కేటీఆర్ లేకపోవటం తెలిసిందే. విదేశీ పర్యటనలో ఉన్న ఆయన క్యాబినెట్ భేటీకి హాజరు కాలేకపోయారు. అయితే.. ఈసారి క్యాబినెట్ భేటీకి మంత్రులు.. సీఎస్ శాంతికుమారి.. ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్.. ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ.. ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారుగా ఈ మధ్యనే ఎంపికైన సోమేశ్ కుమార్ లు హాజరయ్యారు.
నకిలీ విత్తనాల మీద చర్చ సందర్భంగా రాష్ట్ర డీజీపీ అంజనీ కుమార్ ను కూడా క్యాబినెట్ భేటీకి ఆహ్వానించారు. మొత్తంగా కొత్త సచివాలయంలో నిర్వహించిన మొదటి మంత్రివర్గ సమావేశం.. మారథాన్ గా కాకుండా ఒక పెద్ద సినిమా షో టైం లోపు పూర్తి చేశారని చెప్పాలి.