Begin typing your search above and press return to search.
కోదండరాం సర్పంచ్ గా కూడా గెలవలే..: కేసీఆర్
By: Tupaki Desk | 6 Oct 2017 1:30 PM GMTతెలంగాణ జేఏసీ ఛైర్మన్ కోదండరాంపై మరోమారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మండిపడ్డారు. ప్రగతిభవన్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ కోదండరాం తనకు తాను చాలా ఎక్కువగా ఊహించుకుంటున్నాడని ఎద్దేవా చేశారు. కోదండరాం జీవితంలో సర్పంచ్ అయినా అయ్యాడా అని ప్రశ్నించారు. కోదండరాం పిలుపు ఇచ్చాడని మీడియా రాస్తోందని పేర్కొంటూ...పిలుపు ఇవ్వడానికి కోదండరాం ఏమైనా జాతీయ నాయకుడా అని ప్రశ్నించారు. తెలంగాణ జేఏసీకి పేరు పెట్టిందే నేను అని కేసీఆర్ అన్నారు. జేఏసీ విధివిధానాలను తానే సూచించానన్నారు. తాను తీర్చిదిద్దిన నాయకుల్లో కోదండరాం ఒకడని కేసీఆర్ కొత్త విషయం వెల్లడించారు. ఆయన తాడు బొంగరం లేకుండా ఇంకా విమర్శలు చేస్తున్నారని సీఎం కేసీఆర్ తన కామెంట్లను పునరుద్ఘాటించారు.
అమరవీరుల స్ఫూర్తి యాత్ర కోదండరాం చేస్తున్న పర్యటనలను సీఎం కేసీఆర్ ఎద్దేవా చేశారు. అమరవీరుడు శ్రీకాంతా చారి తల్లి ఎన్నికల్లో నిలబడితే మద్దతు ఇవ్వని వాడు అమరవీరుల స్ఫూర్తి యాత్ర అంటూ తిరుగుతాడు అందులో అమరుల ఎక్కడున్నారో స్ఫూర్తి ఎక్కడుందో తెలియదు అంటూ ఎద్దేవా చేశారు. ``కోదండరాం లాంటి బుట్టచోర్ గాళ్ళు అనేక మంది వస్తారు, వీళ్ళను పట్టించుకొనక్కర లేదు. గవర్నమెంట్ మీద విషం కక్కుడు అజెండానా?కేసీఆర్ ను తిట్టుడు ఎజెండానా?`` సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. ముందు నుంచి కోదండరాం అనే వ్యక్తి తెరాసకు పూర్తి వ్యతిరేకి అని కేసీఆర్ ఆరోపించారు. ఉద్యమం సమయంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని కాంగ్రెస్ పార్టీకి చెప్పారని తెలిపారు.
సోషల్ మీడియాలో చిల్లర గ్యాంగ్‌లు విషపూరిత రాతలు రాస్తున్నాయని కేసీఆర్ మండిపడ్డారు. ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడితే ఊరుకునేదే లేదన్నారు. సోషల్ మీడియాలో సీఎం, మంత్రులపై దుష్ప్రచారం చేస్తున్నవారిపై కేసులు పెడతామని స్పష్టం చేశారు. తెలంగాణాను నాశనం చేసిందే కాంగ్రెస్ పార్టీ అని కేసీఆర్ పునరుద్ఘాటించారు. అక్రమంగా ఆనాడు ఆంద్రాలో కలిపింది నెహ్రూ అయితే తెలంగాణా అడిగినందుకు తుపాకులతో కాల్పించింది ఇందిరా గాంధీ అని అన్నారు.