Begin typing your search above and press return to search.
ఏ మాటైనా కేసీఆర్ కే సాధ్యం
By: Tupaki Desk | 20 Aug 2015 10:47 AM GMTఎప్పుడు ఏం మాట్లాడతారో తెలీదన్నట్లుగా తయారైంది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవహారం. అధికారులకే కాదు.. నేతలకు సైతం ఆయన వైఖరి ఓ పట్టాన అర్థం కావటం లేదు. ఏ విషయానికి ఎందుకు సీరియస్ అవుతారో అర్థం కాక జుట్టు పీక్కునే పరిస్థితి నెలకొందని వాపోతున్నారు.
తాజాగా మెదక్ జిల్లా ఎరవెల్లిలో జరిగిన గ్రామజ్యోతి కార్యక్రమానికి హాజరైన కేసీఆర్.. అధికారులపై అగ్రహం వ్యక్తం చేశారు. తామేం తప్పు చేశామా అని గడగడలాడిన వారికి.. కేసీఆర్ కోపానికి కారణం తెలిసి బిక్కముఖం వేసిన పరిస్థితి. ఇంతకీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు అంత కోపం ఎందుకు వచ్చిందంటే.. గ్రామజ్యోతి కార్యక్రమంలో పార్టీ జెండాలు కనిపించటమే.
అధికారిక కార్యక్రమాల్లో పార్టీ జెండాలు కనిపించాల్సిన అవసరం ఏమిటి? అన్న ప్రశ్నకు అధికారులకే కాదు.. చుట్టూ ఉన్న పార్టీ నేతలకు దిమ్మ తిరిగినంత పనైంది. ఇకపై.. ఏ అధికారిక కార్యక్రమాలకు పార్టీ జెండాలు పెట్టొద్దంటూ ఆయన అక్కడికక్కడ ఆదేశాలు జారీ చేశారు. పార్టీ జెండాలకే అంత అగ్రహం వస్తే.. ఈ మధ్య కాలంలో పలు ప్రభుత్వ ఆఫీసులకు పార్టీ రంగు వేసేస్తున్నారు. మరి.. దానికి కేసీఆర్ ఏమంటారో..? ఏది ఏమైనా.. ఏ విషయాన్ని అయినా కేసీఆర్ కు మాత్రమే సాధ్యమేమో.