Begin typing your search above and press return to search.

కేసీఆర్ మాట: బాబు ఓ బొమ్మాళి

By:  Tupaki Desk   |   31 Jan 2016 5:20 AM GMT
కేసీఆర్ మాట:  బాబు ఓ బొమ్మాళి
X
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల సందర్భంగా టీఆర్‌ ఎస్ పార్టీ తరఫున పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించిన ఏకైక బహిరంగ సభలో మాట్లాడిన టీఆర్ఎస్ అధినేత, సీఎం కల్వకుంట్ల చంద్ర శేఖర్‌ రావు ఇటీవలిప్రసంగాలకు భిన్నంగా తన స్పీచ్ ను దంచేశారు. తెలుగుదేశం పార్టీఅధినేత-ఏపీ సీఎం చంద్రబాబు లక్ష్యంగా నిప్పులు చెరిగారు.

జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో తమకే ఓటువేయాలని కోరడం సరికాదనిఅన్నారు. అసలు హైదరాబాద్‌లో చంద్రబాబుకు ఏం పని అని కేసీఆర్ ప్రశ్నించారు. ఆయనకు ఏపీ ప్రజలు కావాల్సినంత పని ఇచ్చారని పేర్కొంటూ రోడ్లు ఊడ్చుకోవాలంటే హిందూపురం నుంచి ఇచ్చాపురం దాకా చాలా బజార్లు ఉన్నాయని ఎద్దేవా చేశారు.అంతేకాకుండా...తమ హైదరాబాద్ రోడ్లను తామే ఊడ్చుకుంటామని తెలిపారు.

హైదరాబాద్‌ ను వదలను గాకాబొమ్మాళి వదలా అని చంద్రబాబు అంటున్నారని ఎద్దేవా చేశారు.తాను అమరావతి వెళ్లి అక్కడే ఉంటానంటే కలుస్తదా? అనికేసీఆర్ ప్రశ్నించారు.విజయవాడకు వెళ్లి హైదరాబాద్ నుంచి పరిపాలన చేయాలంటే విదేశాల నుంచి పాలన చేస్తున్న భావన కలుగుతుందని అంటూ ఏపీ ప్రజలను మభ్యపెడుతున్నారని మండిపడ్డారు.

చంద్రబాబును హైదరాబాద్‌ ను విడిచి వెళ్లాలని ఎవరూఅనడంలేదని తెలిపారు.కావాలంటే చంద్రబాబు ఇంకనాలుగు హెరిటేజ్‌ షాప్ లు పెట్టుకుంటామన్నా అనుమతి ఇస్తామన్నారు. పదిహేనురోజులకోసారి వచ్చి వ్యవహారాలుచూసుకుని వెళ్లొచ్చని సూచించారు. చంద్రబాబు సతీమణి భువనేశ్వరి నిజాయితీ పరురాలని కితాబిచ్చారు. ‘మా వదిన భువనేశ్వరి నిజాయితి పరురాలు.ఆమె కూడా మా టీఆర్‌ ఎస్ పార్టీకే ఓటు వేస్తానని మా కార్యకర్తలకు తెలిపారు’ అని వివరించారు.తప్పకుండా తమకే వేస్తారు ఎందుకంటే టీఆర్ ఎస్ మంచి పనులు చేస్తుందని ఆమెకు కూడా తెలుసని అన్నారు.

మొత్తంగా ఇటీవలి కాలంలో చంద్రబాబు సంయమనం పాటిస్తూస్పందిస్తుండగా..కేసీఆర్ విమర్శలు గుప్పించడం ఆసక్తికరంగా మారింది.