Begin typing your search above and press return to search.

మోడీ సర్కారుతో వార్ కు కేసీఆర్ రెఢీ అయ్యారా?

By:  Tupaki Desk   |   29 Nov 2019 5:06 AM GMT
మోడీ సర్కారుతో వార్ కు కేసీఆర్ రెఢీ అయ్యారా?
X
కోపంతో ఉడికిపోయే వేళలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతలా భగభగలాడతారో తెలిసిందే. తాజాగా ఆర్టీసీ సమ్మె విషయంలో ఇటీవల కాలంలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ చేసిన వ్యాఖ్యలు తెలిసిందే. కేంద్రం అనుమతి లేకుండా ఆర్టీసీని రద్దు చేయరన్న కీలక వ్యాఖ్యతో పాటు.. ఆర్టీసీకి కేంద్రం వాటా ఉందని చెప్పటం తెలిసిందే.

ఆర్టీసీ కార్మికుల్ని వెంటనే విధుల్లో చేరాలంటూ ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్.. తన ప్రెస్ మీట్ లో కేంద్రంపై విరుచుకుపడ్డారు. ఆర్టీసీలో కేంద్రం వాటా లెక్కలు తేలుస్తానని ఆయన అంటున్నారు. అప్పుడెప్పుడో ఏదో రూ.10.. రూ.50 రూపాయిలు ఇచ్చి పొత్తు కలిశారని.. ఉమ్మడి ఏపీలోనూ.. తెలంగాణలోనూ ఆర్టీసీకి పైసా రాల్చింది లేదన్న ఆయన.. కేంద్రం తీరును తప్ప పట్టారు.

ఆర్టీసీపై రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టిన పెట్టుబడులు లెక్కలు లెక్కిస్తే కేంద్రం వాటా 31 శాతానికి రూ.22వేల కోట్లుగా తేలిందని.. ఈ విషయం మీద కేంద్రానికి తాము నోటీసులు ఇస్తామని చెబుతున్నారు. కేంద్రం మీద తాము కచ్ఛితంగా కోర్టుకు వెళతామన్నారు. కేంద్రం వాటా ఉంది కాబట్టి రూ.5వేల కోట్లు కావాలంటే ఇస్తారా? అంటూ మండిపడిన ఆయన మాటలు ఇప్పుడు సంచలనంగా మారాయి.

కేంద్రంతో తేల్చుకుంటామని చెబుతున్న కేసీఆర్ మాటలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారటమే కాదు.. ఆయన సంధించిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సిన బాధ్యత కేంద్రం మీద ఉంటుందని చెప్పక తప్పదు. ఆర్టీసీలో కేంద్రం వాటా ఉందన్న నేపథ్యంలో.. దాని లెక్కలతో కేంద్రంపై పోరుకు కేసీఆర్ సమాయుత్తం అవుతున్నట్లే చెప్పాలి మరి.. దీనికి కేంద్రం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.