Begin typing your search above and press return to search.
కేంద్రంపై కేసీఆర్ కన్నెర్ర..అవినీతి ఉంటే నిరూపించండి
By: Tupaki Desk | 28 March 2018 4:41 AM GMTతెలంగాణ రాష్ట్ర ఉద్యమం నుంచి మొదలుకొని రాష్ర్టాన్ని అభివృద్ధిపథంలో నడిపించడం తమకొక టాస్క్ అని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు స్పష్టంచేశారు. `తెలంగాణ అంటే టీఆర్ ఎస్ కు టాస్క్. ఇతర పార్టీలకు రాజకీయం. రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా టాస్క్ కిందనే తీసుకుని పనిచేస్తున్నాం` అని చెప్పారు. రాష్ర్టాన్ని సర్వతోముఖాభివృద్ధి పథంలో నడిపించేందుకు ఒక విజన్‌తో ముందుకు సాగుతున్నామన్నారు. ఈ క్రమంలోనే అనేక పథకాల అమల్లో ఏకైక రాష్ట్రంగా - నంబర్ వన్ రాష్ట్రంగా తెలంగాణ ఎదిగిందని చెప్పారు. జీడీపీ - తలసరి ఆదాయం వంటివాటిలో జాతీయ సగటుకన్నా తెలంగాణ సగటు ఎక్కువగా ఉన్నదన్నారు. ఈ రోజు దేశాన్ని సాకుతున్న ఏడు రాష్ర్టాల్లో ఒకటిగా తెలంగాణ నిలిచిందని చెప్పారు. తను - తన ప్రభుత్వం అవినీతి చేస్తే నిరూపించాలని కేసీఆర్ సవాల్ విసిరారు.
ఓట్లను ఆకర్షించడమే రాజకీయ పార్టీల పని అని కేసీఆర్ కుండబుద్దలు కొట్టినట్లు చెప్పారు. ``ప్రజాస్వామ్యంలో ఓట్లను ఆకర్షించడమే రాజకీయ పార్టీల పని. అన్ని రాజకీయ పార్టీలు చేసేది అదే. దీనికి హిపోక్రసి ఎందుకు? ఓట్లు ఆకర్షించలేకపోతే రాజకీయ పార్టీ ఎందుకు? ప్రజల అభివృద్ధికి ఎవరు ఎక్కువ కృషి చేస్తారో వారే గెలుస్తారు. ప్రజలను ఆకర్షించకపోతే వికర్షిస్తారా? ఎన్నికలకు ఏడాది సమయం ఉంది. ప్రభుత్వం ఆలోచన తీరు బడ్జెట్లో కనిపిస్తున్నది. అందుకే ఐదేళ్లు అంటున్నాను` అని తెలిపారు. తన ప్రభుత్వంలో అవినీతి ఉంటే నిరూపించాలని ఆయన సవాల్ విసిరారు. ` నాలుగేళ్లయింది.. ఒక్క అవినీతి అంశమైనా బయటపెట్టలేదు. 2013లో కూడా ఔట్ లుక్ అనే పత్రిక వాళ్లు హైదరాబాద్.. స్కాం క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని వేశారు. ఇది గత చరిత్ర. ఇప్పుడా చరిత్ర ఉందా? ప్రతిపక్షాలు చెప్పే డొంకతిరుగుడు ఉపన్యాసాలు తప్ప అవినీతి ఉందా? అంతకు ముందు ఉన్న అవినీతిని మేం పూర్తిగా అరికట్టాం. గతంలో సెక్రటేరియట్‌లో పైరవీకారుల మందలు ఉండేవి. ఇప్పుడు అవి ఎక్కడా కనిపించడం లేవు. గతంలో కాంట్రాక్టు ఇస్తే ఈపీసీ - మొబిలైజేషన్ అడ్వాన్స్ లు అని అవినీతి ఉండేది. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నీ తీసేశాం.` అని కేసీఆర్ తెలిపారు.
ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వంపై కేసీఆర్ మండిపడ్డారు. అభివృద్ధి చెందుతున్న రాష్ర్టాలకు సహకారం ఇవ్వాలని కోరానని అయినప్పటికీ కేంద్రం పట్టించుకోలేదని అసహనం వ్యక్తం చేశారు. `రాష్ర్టాలు అడుక్కునే పరిస్థితిలో కాకుండా డిమాండ్ చేసే స్థాయిలో ఉండాలి. వ్యవసాయశాఖ - ఆరోగ్యశాఖ - పట్టణాభివృద్ధి - గ్రామీణాభివృద్ధి శాఖలు కేంద్ర దగ్గర ఉండాల్సిన అవసరం లేదు. కేంద్రం చేయాల్సిన పని చేయకుండా - రాష్ర్టాలను బికారులుగా మార్చి సెంట్రలైజేషన్ చేస్తున్నారు. మాటల్లో చెప్తున్న ఫెడరలిజం.. పవర్స్ ఇవ్వడంలో లేదు. అందుకే అన్ని రాష్ర్టాల సీఎంలు - ఆర్థికమంత్రులు ప్రొటెస్ట్ చేస్తున్నారు. పరిస్థితి ఇట్లానే ఉంటే జాతి సమగ్రతకు కూడా మంచిది కాదు. దేశం ముందుకు వెళ్లాలంటే రాజకీయంగా గుణాత్మకమైన మార్పు రావాలి. తెలంగాణ నుంచి నేను కూడా అందులో క్రియాశీల పాత్ర పోషిస్తాను.` అని కేసీఆర్ స్పష్టం చేశారు.