Begin typing your search above and press return to search.

కేసీఆర్ ఫైన‌ల్ చేసిన ఎంపీ అభ్య‌ర్థులు వీరేనట‌!

By:  Tupaki Desk   |   12 March 2019 4:45 AM GMT
కేసీఆర్ ఫైన‌ల్ చేసిన ఎంపీ అభ్య‌ర్థులు వీరేనట‌!
X
అభ్య‌ర్థుల ఎంపిక విష‌యంలో టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ అనుస‌రించే వ్యూహం ప‌క్కాగా ఉంటుంద‌ని చెబుతారు. అన‌ని ర‌కాలుగా ఆలోచించిన త‌ర్వాత మాత్ర‌మే టికెట్ల‌ను ఫైన‌ల్ చేయ‌టం జ‌రుగుతుంది. ప్ర‌స్తుతం కేసీఆర్ హ‌వా న‌డుస్తుండ‌టం.. ఆయ‌న మాట‌కు.. నిర్ణ‌యానికి ఎదురు చెప్పే ద‌మ్ము.. ధైర్యం సొంత పార్టీలోనే కాదు.. తెలంగాణ రాష్ట్రంలోనూ ఎవ‌రికి లేద‌ని చెబుతారు.

తెలంగాణ‌లోని 17 ఎంపీ స్థానాల‌కు 16 స్థానాల్ని సొంతం చేసుకోవాల‌న్న ఆలోచ‌న‌తో ఉన్న కేసీఆర్‌.. అందుకు త‌గ్గట్లు పావులు క‌దుపుతున్నారు. 16 స్థానాల్ని సొంతం చేసుకోవ‌టం ద్వారా జాతీయ స్థాయిలో చ‌క్రం తిప్పాల‌ని భావిస్తున్న నేప‌థ్యంలో ప్ర‌తి సీటు విలువైన‌దిగా చెబుతున్నారు. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో ఒకట్రెండు సీట్లు చేజారినా కేసీఆర్ ప‌ని అయిపోయింద‌న్న వాద‌న జోరందుకుంటుంది.

ఈ కార‌ణంతోనే ఈ లోక్ స‌భ ఎన్నిక‌లు కేసీఆర్ స‌మ‌ర్థ‌త‌కు ప‌రీక్ష‌గా మారాయ‌ని చెబుతున్నారు. కేసీఆర్ చెప్పిన‌ట్లే తెలంగాణ‌లో జ‌రుగుతుంద‌న్న మాట‌కు నిలువెత్తు నిద‌ర్శ‌నంగా లోక్ స‌భ ఎన్నిక‌ల ఫ‌లితాలు మార‌తాయ‌న్న అంచ‌నాలు ఉన్నాయి. దీనికి తోడు నియోజ‌క‌వ‌ర్గం ఏదైనా.. అభ్య‌ర్థి ఎవ‌రైనా.. ఓటు వేసేది అభ్య‌ర్థిని చూసి కాదు.. కేసీఆర్ ను చూసి అన్న భావ‌న‌ను క‌లుగ‌జేయ‌టంలో గులాబీ బాస్ స‌క్సెస్ అయ్యారు.

అలా అని ఇష్టం వ‌చ్చిన వారిని అభ్య‌ర్థులుగా ఎంపిక చేయ‌కుండా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు. మొత్తం పోటీ చేయాల‌నుకుంటున్న 16 స్థానాల్లో ఏడు సీట్ల విష‌య‌మై కేసీఆర్ క్లారిటీతో ఉన్న‌ట్లు చెబుతున్నారు. మిగిలిన తొమ్మిది స్థానాల మీద‌నే ఆయ‌న క‌స‌ర‌త్తు చేస్తున్న‌ట్లు చెబుతున్నారు. అభ్య‌ర్థుల ఎంపిక‌ను మ‌రో రెండు రోజుల్లో పూర్తి చేసి ఒకేసారి అభ్య‌ర్థుల్ని ప్ర‌క‌టించాల‌న్న ఆలోచ‌న‌లో కేసీఆర్ ఉన్నారు. దీనికి త‌గ్గ‌ట్లే.. కేసీఆర్ త‌న‌కు తానే స్వ‌యంగా అభ్య‌ర్థుల ఎంపిక ప్ర‌క‌ట‌న మ‌రో రెండు రోజుల్లో ఉంటుంద‌ని చెప్ప‌టం గ‌మ‌నార్హం.

కేసీఆర్ క‌న్ఫ‌ర్మ్ చేసిన ఏడు లోక్ స‌భ స్థానాల అభ్య‌ర్థులు ఎవ‌ర‌న్నది చూస్తే.. వీరిలో ఆరుగురు సిట్టింగులు కాగా.. మ‌రొక‌రు మాజీ మంత్రి ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఏడు స్థానాల‌కు కేసీఆర్ ఫైన‌ల్ చేసిన రేసుగుర్రాలివే అన్న ప్ర‌చారం సాగుతోంది.

1. క‌రీంన‌గ‌ర్ బోయినపల్లి వినోద్‌ కుమార్‌
2. నిజామాబాద్ కల్వకుంట్ల కవిత
3. మెద‌క్ కొత్త ప్ర‌భాక‌ర్ రెడ్డి
4. జ‌హీరాబాద్ బీబీ పాటిల్
5. భువ‌న‌గిరి బూర న‌ర్స‌య్య గౌడ్‌
6. ఆదిలాబాద్ జి. న‌గేష్
7. నాగ‌ర్ క‌ర్నూలు పి. రాములు (మాజీ మంత్రి)