Begin typing your search above and press return to search.

సార్ స‌భ‌ల‌కు జ‌నం పోటెత్తాల‌ట‌!

By:  Tupaki Desk   |   26 Sep 2018 5:20 AM GMT
సార్ స‌భ‌ల‌కు జ‌నం పోటెత్తాల‌ట‌!
X
ముంద‌స్తు ఎన్నిక‌ల వేళ తెలంగాణ అధికార‌ప‌క్షం చేప‌ట్టే బ‌హిరంగ స‌భ‌ల‌కు సంబంధించిన వ్యూహం ప‌క్కాగా సిద్ధ‌మైంది. ఆప‌ద్ద‌ర్మ ముఖ్య‌మంత్రి హోదాలో ఉన్న కేసీఆర్‌.. 50 రోజుల్లో 100 స‌భ‌ల్ని నిర్వ‌హించాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకున్న సంగ‌తి తెలిసిందే. తొలుత ప్ర‌క‌టించిన‌ట్లుగా బ‌హిరంగ స‌భ‌ల్ని నిర్వ‌హించ‌టంలో కాస్త ఆల‌స్య‌మైంది. వినాయ‌క‌చ‌వితి పేరు చెబుతున్నా.. కార‌ణం వేరే ఉంద‌న్న మాట వినిపిస్తోంది.

టికెట్ల జాబితా నేప‌థ్యంలో వెల్లువెత్తిన అసంతృప్తి జ్వాల‌లు చ‌ల్లార్చ‌టంతో పాటు.. నేత‌ల విదేయ‌త మీద కేసీఆర్ చేసిన క‌స‌రత్తు కార‌ణంగా బ‌హిరంగ స‌భ‌లను వాయిదా వేసిన‌ట్లుగా తెలుస్తోంది. రోజులు గ‌డిచిపోతున్నా.. బ‌హిరంగ స‌భ‌ల్ని ఏర్పాటు చేస్తాన‌న్న కేసీఆర్‌.. ఆ దిశ‌గా ఎలాంటి ప్ర‌క‌ట‌న చేయ‌క‌పోవ‌టంపై టీఆర్ ఎస్ వ‌ర్గాల్లో టెన్ష‌న్ ప‌ట్టుకుంది.

ఇదిలా ఉంటే.. తాజాగా కేసీఆర్ బ‌హిరంగ స‌భ‌ల‌కు సంబంధించిన తొలి షెడ్యూల్ ను తాజాగా వెల్ల‌డించారు. సార్ స‌భ‌లు కొత్త జిల్లాల ప్రాతిప‌దిక‌న కాకుండా.. పాత ప‌ది జిల్లాల లెక్క‌న సాగుతున్న‌ట్లుగా చెబుతున్నారు. తాజాగా త‌న నివాసంలో ముఖ్య‌నేత‌ల‌తో నిర్వ‌హించిన స‌మావేశంలో వ‌చ్చే నెల మూడున ఉమ్మ‌డి నిజామాబాద్‌లో.. 4న ఉమ్మ‌డి న‌ల్గొండ‌లో.. 5న ఉమ్మ‌డి మ‌హబూబ్ న‌గ‌ర్ జిల్లా వ‌న‌ప‌ర్తిలో.. 7న ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ లో.. 8న ఉమ్మ‌డి ఖమ్మం జిల్లాల్లో స‌భ‌ల్ని నిర్వ‌హిస్తార‌ని చెబుతున్నారు.

ఆరురోజుల వ్య‌వ‌ధిలో ఐదు స‌భ‌ల్ని నిర్వ‌హించ‌టం ద్వారా.. ఐదు జిల్లాల్ని క‌వ‌ర్ చేసిన‌ట్లు అవుతుంద‌ని భావిస్తున్నారు.ఈ స‌భ‌ల‌కు మిగిలిన విష‌యాలు ఎలా ఉన్నా.. జ‌న‌స‌మీక‌ర‌ణ విష‌యంలో ప్ర‌త్యేక జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని.. సార్ స‌భ‌ల‌కు జ‌నం పోటెత్తే విష‌యంలో ప‌క్కా ఏర్పాట్లు చేయాల‌న్న మాట పార్టీ అధినాయ‌క‌త్వం నుంచి అందిన‌ట్లుగా చెబుతున్నారు.

స‌భ‌ల‌కు అవ‌స‌ర‌మైన జ‌న‌స‌మీక‌ర‌ణ ఎలా చేప‌ట్టాల‌న్న అంశం మీద కూడా కేసీఆర్ ఇన్ వాల్వ్ కావ‌ట‌మే కాదు.. ఆయా ప్రాంతాల‌కు చెందిన నేత‌ల‌కు వ్య‌క్తిగ‌తంగా టార్గెట్లు ఇచ్చిన‌ట్లుగా చెబుతున్నారు. స‌భ‌లు ఎన్ని పెట్టామ‌న్న‌ది కాద‌ని.. సద‌రు స‌భ‌ల‌కు వ‌చ్చే జ‌న‌సందోహమే కీల‌కంగా ఆయ‌న చెప్పిన‌ట్లు తెలిసింది. తొలిద‌శ‌లో నిర్వ‌హించే ఐదు స‌భ‌ల్ని ప‌క్క‌న పెడితే.. ఎన్నిక‌ల షెడ్యూల్ కు ముందు మ‌రో ప‌ది రోజుల వ్య‌వ‌ధిలో ప‌ది స‌భ‌ల్ని నిర్వ‌హిస్తార‌ని చెబుతున్నారు.ఈ స‌భ‌లతో టీఆర్ ఎస్ కు ప్ర‌జ‌ల్లో ఎంత ఆద‌ర‌ణ ఉంద‌న్న విష‌యం ఫోక‌స్ అయ్యేలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్న‌ట్లు చెబుతున్నారు. మ‌రి.. కేసీఆర్ ఆలోచ‌న‌ల‌కు త‌గ్గ‌ట్లు గులాబీ నేత‌లు ఎంత‌వ‌ర‌కు వ‌ర్క్ చేస్తారో చూడాలి.