Begin typing your search above and press return to search.
ఆణిముత్యాలకు టికెట్లు లేవా ?
By: Tupaki Desk | 10 Jun 2023 9:47 AM GMTకొంతకాలం క్రితం కేసీయార్ స్వయంగా తెగమెచ్చుకున్న నలుగురు ఆణిముత్యాలకు రాబోయే ఎన్నికల్లో టికెట్లు ఇవ్వకూడదని డిసైడ్ అయ్యారట. బీఆర్ఎస్ ఎంఎల్ఏల కొనుగోలు ఎపిసోడ్ లో ఫాంహౌజ్ రాజకీయాల్లో నలుగురు ఎంఎల్ఏలు బీరం హర్షవర్ధనరెడ్డి, పైలెట్ రోహిత్ రెడ్డి, గువ్వల బాలరాజు, రేగా కాంతారావు రాష్ట్రంలో ఎంతగా పాపులర్ అయ్యారో కొత్తగా చెప్పక్కర్లేదు. బీఆర్ఎస్ ఎంఎల్ఏలను బీజేపీ కొనుగోలు వ్యవహారాన్ని బయటపెట్టారంటు పై నలుగురు ఎంఎల్ఏలను కేసీయార్ తెగపొగిడేశారు.
రాష్ట్రంలో జరిగిన బహిరంగసభలకు వీళ్ళని ప్రత్యేకంగా తీసుకెళ్ళి పొగడ్తలతో ముంచెత్తారు. పార్టీకి, తెలంగాణా ఆత్మాభిమానానికి ఇలాంటి ఆణిముత్యాలే కావాలంటు పదేపదే చెప్పారు. సీన్ కట్ చేస్తే రాబోయే ఎన్నికల్లో ఈ ఆణిముత్యాలకు టికెట్లు డౌటే అంటున్నారు.
ఎందుకంటే వీళ్ళ నియోజకవర్గాల్లో ఫుల్లుగా నెగిటివ్ వచ్చేసిందని తేలిందట. విచిత్రం ఏమిటంటే వీళ్ళ నలుగురిని కొంతకాలం ప్రగతిభవన్లోనే ఉంచుకున్నారు. తర్వాత వీళ్ళకి బుల్లెట్ ప్రూఫ్ కార్లిచ్చారు. హెవీ సెక్యూరిటి కల్పించారు.
దీన్ని అవకాశంగా తీసుకున్న నలుగురు తమ నియోజకవర్గాల్లో రెచ్చిపోయారట. తాండూరులో రోహిత్ రెడ్డికి వ్యతిరేకంగా పార్టీ నేతలు ఏకమయ్యారట. అలాగే జనాల్లో కూడా బాగా వ్యతిరేకత పెరిగిపోయిందని సమాచారం. ఇక అచ్చంపేటలో గువ్వల బాలరాజు పరిస్ధితి కూడా అలాగే తయారైందట. గువ్వల వ్యవహార శైలితోనే పార్టీ క్యాడర్ తో పాటు జనాల్లో కూడా వ్యతిరేకత పెరిగిపోయిందట.
ఇక హర్షవర్ధన్ తో పాటు పినపాకలో రేగా కు కూడా జనాల్లో వ్యతిరేకత పెరిగిపోయిందట. అప్పట్లో కేసీయార్ కు దగ్గరైన ఈ ఆణిముత్యాలు పార్టీ నేతలు, క్యాడర్, జనాలకు మాత్రం దూరమైపోయారట.
వీళ్ళంతా భూకబ్జాలు, సెటిల్మెంట్లు, కాంట్రాక్టుల్లో, సంక్షేమపథకాల అమల్లో బాగా డబ్బులు దండుకుంటున్నట్లు ఆరోపణలు పెరిగిపోతున్నాయి. అందుకనే పార్టీలోనే నేతలు వ్యతిరేకమైపోయారు. క్యాడర్ దూరం కావటంతో జనాల్లో కూడా వ్యతిరేకత పెరిగిపోయిందట.
కొంతకాలంగా జరుగుతున్న సర్వేల్లో నెగిటివ్ రిపోర్టులు వస్తున్న కారణంగానే వీళ్ళకు ప్రత్యామ్నాయంగా వేరే వాళ్ళని దింపేందుకు కేసీయార్ రెడీ అయినట్లు సమాచారం. మరి చివరకు ఏమవుతుందో చూడాల్సిందే.