Begin typing your search above and press return to search.
మీడియాకు దూరంగా కేసీఆర్ ఫ్యామిలీ
By: Tupaki Desk | 9 March 2023 12:42 PM GMTఢిల్లీ లిక్కర్ స్కామ్ విషయంలో జరుగుతున్న డెవలప్మెంట్లపై కెసిఆర్ ఫ్యామిలీ నోరిప్పటం లేదు. ఈనెల 11వ తేదీన విచారణకు హాజరు కావాలని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కల్వకుంట్ల కవితకు ఇచ్చిన నోటీసులపై మంత్రులు, అధికార పార్టీ నేతలు మీడియా ముందుకు వచ్చి గొంతులు చించుకుంటున్నారు. ఇంతమంది ఇన్నిరకాలుగా మాట్లాడుతున్నా మరి కెసిఆర్ ఫ్యామిలీ మాత్రం ఎందుకని నోరిప్పటంలేదు. కెసిఆర్, కేటీయారే కాదు హరీష్ రావు, ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ కూడా మీడియాకు దొరకటం లేదు.
పైన చెప్పిన నేతల్లో ఎవరూ మీడియాకు దూరంగా ఉండేవారు కాదు. ప్రత్యర్ధులపై మీడియా ముందు రెగ్యులర్ గా విరుచుకుపడేవారే. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడాలంటే కెసిఆర్, కేటీఆర్, హరీష్ రావు ఏ స్ధాయిలో రెచ్చిపోతున్నారో అందరు చూస్తున్నదే. అలాంటిది కల్వకుంట్ల కవితకు ఈడీ నోటీసులపై ఎందుకని వీళ్ళెవరూ నోరు మెదపటంలేదు ? లిక్కర్ స్కామ్ లో కవిత పాత్ర నిజంగానే లేకపోతే వీళ్ళు ఊరుకునేవారేనా ?
అలాంటిది వీళ్ళెవరూ నోరిప్పటంలేదంటేనే జనాలకు ఏమి సిగ్నల్ పంపుతున్నట్లు ? రెండు రోజుల క్రితమే ఢిల్లీ ఉపముఖ్యమంత్రిగా పనిచేసిన మనీష్ సిసోడియా అరెస్టు విషయంలో కూడా కెసిఆర్, కేటీఆర్, హరీష్ ఈడీని, కేంద్ర ప్రభుత్వాన్ని నానా మాటలు అన్నవారే. అలాంటిది కవితను ఈడీ విచారణకు పిలవటంపై మాత్రం మీడియా ముందుకు రాలేకపోతున్నారు. ఇపుడే కాదు గతంలో సీబీఐ విచారణ సందర్భంలో కూడా కెసిఆర్ ఫ్యామిలీతో పాటు ఎంపీ, మాజీ ఎంపీ నోరిప్పలేదు.
వీళ్ళ మౌనం విషయంలోనే జనాలు రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. లిక్కక్ స్కామ్ లో కవిత పాత్ర ఉండబట్టే ఏమి మాట్లాడాలో అర్ధంకాక కెసిఆర్ ఫ్యామిలీ వ్యూహాత్మక మనం పాటించిందనే ప్రచారం జనాల్లో బాగా పెరిగిపోతోంది. ఒకవేళ మీడియా ముందుకు వస్తే అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేమని తెలిసే మీడియాను ఎవాయిడ్ చేస్తోందని జనాలు చెప్పుకుంటున్నారు. ఏదేమైనా కవిత విచారణ విషయంపై మాట్లాడితే ఒక సమస్య, మాట్లాడకుండా మౌనంగా ఉంటే మరో సమస్య అన్నట్లుగా తయారైంది వ్యవహారం.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.