Begin typing your search above and press return to search.

కేసీఆర్ కు సైతం చేత‌కాని ప‌ని ఒక‌టుంది

By:  Tupaki Desk   |   25 Jun 2018 5:23 AM GMT
కేసీఆర్ కు సైతం చేత‌కాని ప‌ని ఒక‌టుంది
X
తెలంగాణ సాధించినోడ్ని నాకు చేత‌కానిది ఏమైనా ఉంటుందా? దేన్నైనా స‌రే.. ఇట్టే అవ‌లీల‌గా చేసేస్తా. క‌రెంట్ విజ‌య‌గాథను అదే ప‌నిగా చెప్పే కేసీఆర్‌.. హైద‌రాబాద్ మ‌హా న‌గ‌రాన్ని ఏ మాత్రం మార్చ‌లేని వైనం మీద నోరు విప్పింది లేదు. తాజాగా ఆ విష‌యాన్ని త‌న‌దైన శైలిలో చెప్పుకొచ్చారు.

మాజీ మంత్రి దానం నాగేంద‌ర్ టీఆర్ ఎస్ పార్టీలో జాయిన్ అయిన నేప‌థ్యంలో ఏర్పాటు చేసిన స‌భ‌లో మాట్లాడిన కేసీఆర్‌.. హైద‌రాబాద్ మ‌హా న‌గ‌రాన్ని తాను మార్చ‌లేక‌పోయాన‌న్న విష‌యాన్ని ప‌రోక్షంగా ఒప్పేసుకున్నారు. స‌క్సెస్ ను త‌న ఖాతాలో వేసుకొని.. ఫెయిల్యూర్ ను ఎదుటోడి ఖాతాలో వేసే విష‌యంలో కేసీఆర్ నైపుణ్య‌మే వేరు.

అసాధ్య‌మ‌నుకున్న తెలంగాణను తీసుకొచ్చిన కేసీఆర్ కు.. ఏ టాస్క్ అయినా పెద్ద విష‌యం కానే కాదు. కానీ.. హైద‌రాబాద్ మ‌హాన‌గ‌రాన్ని మార్చ‌టం ఆయ‌న వ‌ల్ల కాద‌న్న విష‌యం గ‌డిచిన నాలుగేళ్ల పాల‌న‌లో తేలిపోయింది. 2014 సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు ముందు హైద‌రాబాద్‌ లో ఉన్న ప‌రిస్థితికి.. ఇప్ప‌టికి వ్య‌త్యాసం చూస్తే.. ప‌లు విష‌యంలో సిటీ మ‌రింత దారుణంగా మారింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

ట్రాఫిక్ అంత‌కంత‌కూ పెర‌గ‌ట‌మే కాదు.. చినుకు ప‌డితేనే త‌టాకాలు మారే హైద‌రాబాద్ రోడ్లు వ‌ణికిస్తున్నాయి. ఇది చాల‌ద‌న్న‌ట్లుగా కేసీఆర్ నాలుగేళ్ల పాల‌న‌లో చెరువుల ద‌గ్గ‌ర ఏర్పాటు చేసిన ట్రాకుల‌తో అపార్ట్ మెంట్ సెల్లార్లు మునిగిపోయిన వైనం శుక్ర‌వారం రాత్రి కురిసిన భారీ వ‌ర్షం స్ప‌ష్టం చేసింది.

ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన కొత్త‌ల్లో హైద‌రాబాద్ ను విశ్వ‌న‌గ‌రంగా చేస్తాన‌ని.. గ‌త పాల‌కులు చేసిన త‌ప్పుల్ని తాను స‌రిచేస్తాన‌ని.. ఇందుకు భారీ ప్ర‌క్షాళ‌న జ‌ర‌పనున్న‌ట్లుగా చెప్పి హైద‌రాబాదీయుల్లో కొత్త ఆశ‌ల్ని రేకెత్తించారు. అయితే.. అదేమీ కేసీఆర్ మాట‌లు చెప్పినంత ఈజీ కాద‌న్న విష‌యం తేలిపోయింది. నాలుగేళ్ల త‌న పాల‌న‌లో హైద‌రాబాద్ మ‌హా న‌గ‌రాన్ని మార్చ‌లేక‌పోయిన కేసీఆర్‌.. హైద‌రాబాద్‌ను గ‌త పాల‌కులు మురికి కుంట‌గా త‌యారు చేశార‌ని మండిప‌డ్డారు.

ఎన్నిక‌ల త‌ర్వాత న‌గ‌రాన్ని స్వ‌ర్గ‌సీమ‌గా మారుస్తామ‌న్న ఆయ‌న‌.. తాజా ట‌ర్మ్ లో మాత్రం హైద‌రాబాద్ ను తానేమీ చేయ‌లేన‌న్న విష‌యాన్ని తేల్చేసిన‌ట్లే. అసాధ్యాల‌ను సుసాధ్యం చేసే స‌త్తా త‌న సొంత‌మ‌ని చెప్పుకునే కేసీఆర్ లాంటోడికి సైతం ఒక ప‌ట్టాన అంతు చిక్క‌ని హైద‌రాబాద్ సిటీ రెండో ట‌ర్మ్ లో అయినా మారుతుందంటారా?