Begin typing your search above and press return to search.
కేసీఆర్ కంటి ఆపరేషన్ ఈ రోజు
By: Tupaki Desk | 9 May 2017 5:25 AM GMTతెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు కంటి ఆపరేషన్ ను ఢిల్లీలో చేయనున్నారు. ఇదేమీ ఇప్పటికిప్పుడు వచ్చిన సమస్య కాదు. లాంగ్ పెండింగ్ ప్రాబ్లంగా చెబుతున్నారు. కుడి కంట్లో పొర రావటం.. దాన్ని తొలగించాలని తాజాగా డిసైడ్ చేశారు. దీంతో ఈ రోజు ఢిల్లీలో కేసీఆర్ కంటికి ఆపరేషన్ చేయించనున్నారు. నిజానికి కేసీఆర్ రెండు కళ్లకు సమస్యలున్నాయి. నాటి యూపీఏ 1 సర్కారు హయాంలో కేంద్ర కార్మిక మంత్రిగా వ్యవహరించిన సమయంలో ఆయన ఎడమ కంటికి ఆపరేషన్ చేశారు.
తాజాగా రెండో కంటికి వచ్చిన పొరను తొలగించాలని నిర్ణయించారు. ఢిల్లీలోని కంటి వైద్యులు డాక్టర్ సచిదేవ్ నేతృత్వంలో మరోసారి కంటి ఆపరేషన్ ఈ రోజు (మంగళవారం) జరగనుంది. కేసీఆర్ కు కంటి ఆపరేషన్ జరగనున్న నేపథ్యంలో.. ఆయన ఫ్యామిలీ మొత్తం ఢిల్లీకి షిఫ్ట్ అయినట్లుగా తెలుస్తోంది. ముందుగా అనుకున్న ప్రకారం.. ఫ్యామిలీ మొత్తంఢిల్లీ వెళ్లాలని అనుకున్నా.. అందులో మంత్రి కేటీఆర్ పేరు లేదని చెబుతున్నారు. అయితే.. కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ తో గల్ఫ్ దేశాల్లోని భారతీయుల కష్టాలపై సమావేశం ఏర్పాటు చేయటంతో కేటీఆర్ సైతం దేశ రాజధానికి వెళ్లాల్సి వచ్చింది.
కేసీఆర్ ఆపరేషన్ కోసం ఆయన వెంట.. సతీమణి.. కుమార్తె కవిత.. కోడలు.. మనమళ్లు.. మనమరాళ్లు ఢిల్లీకి వెళ్లినట్లుగా చెబుతున్నారు. ఆపరేషన్ చేసిన తర్వాత కనీసం వారం.. పది రోజుల పాటు విశ్రాంతి అవసరం అవుతుందని చెబుతున్నారు. చూస్తుంటే.. మరో వారం.. పది రోజుల వరకూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కనిపించరన్న మాట.