Begin typing your search above and press return to search.
బ్రేకింగ్: తెలంగాణ లో ఏప్రిల్ 30 వరకు లాక్ డౌన్
By: Tupaki Desk | 11 April 2020 3:52 PM GMTకేసీఆర్ సంచలన ప్రకటన చేశారు. తెలంగాణ వ్యాప్తంగా ఏప్రిల్ 30 వరకు లాక్ డౌన్ ప్రకటించారు. ఈ విషయంపై ప్రధానికి కూడా చెప్పినట్లు కేసీఆర్ వెల్లడించారు. తనతో పాటు అత్యధిక రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్రమే పొడిగించాలని కోరినట్లు తెలిపారు. మనం ఇంతకాలం ఓపిక పట్టాం. ఇంకొంత కాలం ఓపిక పడితే మొత్తం సెట్ అవుతుంది అని కేసీఆర్ పేర్కొన్నారు.
కంటైన్ మెంట్ జోన్స్ అనే పద్ధతి ద్వారా కూడా వ్యాధి ప్రబలకుండా ఆపగలుగుతున్నామని... ప్రపంచంలో చాలా తోపు దేశాల కంటే కూడా మనం ఎంతో బాగా కంట్రోల్ చేసుకోగలిగాం అని... ఈ కొద్ది రోజులు ఓపికపడితే మనదే విజయం అని కేసీఆర్ అన్నారు. ప్రజలు సహకరించాలని కోరారు. ఇక సొంతూరికి వెళ్లే వారిని పంపిద్దాం అని కొందరు ప్రధానిని అడిగారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో దానిని అంగీకరించవద్దన్నారు. ఎక్కడ ఉండేవారు అక్కడే ఉండాలి. ఇంతకాలం ఓపిక పట్టాం. ఇంకో 20 రోజులు ఓపిక పడితే మనం సేఫ్ అని కేసీఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు.