Begin typing your search above and press return to search.
ఒక్క బక్క కేసీఆర్ ను కొట్టడానికి ఇంతమంది వస్తారా?: కేసీఆర్
By: Tupaki Desk | 28 Nov 2020 4:10 PM GMTగ్రేటర్ సభ సాక్షిగా టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ చెడుగుడు ఆడేశారు. మాటల తూటాలు పేల్చారు. తనదైన శైలిలో వాగ్భాణాలు సంధించారు. హైదరాబాద్ కు వరదల్లా కేంద్రమంత్రులు వస్తున్నారని.. ఒక బక్క కేసీఆర్ ను కొట్టడానికి ఇంత మంది వస్తారా? అని కేసీఆర్ ప్రశ్నించారు. ఈ దేశం గతి మార్చాలని.. జీహెచ్ఎంసీ ఎన్నికల ద్వారానే సందేశమివ్వాలని జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ కాపు కాస్తున్న వేళ హైదరాబాదీలకు కీలకమైన పిలుపును ఇచ్చారు.హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. ప్రజలు ఓటేసే ముందు సంబంధిత నాయకుడి గురించి ఎవరికి వారు ఆలోచించుకోవాలని సీఎం కేసీఆర్ ప్రజలకు సూచించారు.ఇలా జరిగితేనే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుందని అన్నారు. తద్వారా ప్రజలకు సేవ చేసే మంచి నాయకులు పుట్టుకొస్తారని చెప్పారు.
హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో టీఆర్ఎస్ నిర్వహించిన భారీ బహిరంగ సభలో సీఎం మాట్లాడారు. ‘‘ఎన్నో అపోహల మధ్య తెలంగాణ వచ్చింది. ఎంతో మంది నమ్మకంతో ప్రజలు తొలి నుంచి టీఆర్ఎస్‌కే పట్టం కట్టారు. రాష్ట్రాన్ని నడపలేరని ప్రముఖ జర్నలిస్టు పొత్తూరు వెంకటేశ్వరరావు అన్నారు. కానీ, వారి అంచనాలన్నీ తలకిందులయ్యాయని ఆయనే నాతో అన్నారు. ఈ ఆరేళ్లు తెలంగాణలో ఎలాంటి మార్పులు జరిగాయో మీకందరికీ తెలుసు.. హైదరాబాద్ నగరం ఎంతో విశేషమైన చైతన్యవంతమైన నగరం. గతంలో మనం ఎన్నో మాటలు పడ్డాం. 2001లో నేను ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం చేపట్టినప్పుడు ఎంతో మంది ఎన్నో మాటలు అన్నారు. ’’ అని కేసీఆర్ తెలంగాణలో జరుగుతున్న మార్పులను ఏకరువు పెట్టారు..
ఇక తెలంగాణ రాకముందు కరెంట్ కోతల వల్ల అందరూ జేనరేటర్లు, ఇన్వర్టర్లు పెట్టుకునేవారని.. ఇప్పుడు అలాంటిదేమీ లేకుండా 24 గంటల నాణ్యమైన కరెంట్ ఇస్తున్నామని కేసీఆర్ తెలిపారు. తెలంగాణ వచ్చాక ఇదో సంచలన పరిణామం అని.. దీనివెనుక ఎంతో శ్రమ ఉందని అన్నారు. తలసరి విద్యుత్ వినియోగం తెలంగాణకే అధికంగా ఉందని.. కేంద్రప్రభుత్వమే చెప్పిందని కేసీఆర్ చెప్పుకొచ్చారు.
మిషన్ భగీరథతో 24 గంటల మంచి నీరు సదుపాయం కల్పించాలన్నదే నా కల కేసీఆర్ అన్నారు. రాబోయే కొద్ది సంవత్సరాల్లోనే 24 గంటల మంచినీటి సరఫరా వచ్చేలా పనిచేస్తామన్నారు. ఇప్పటికే నగరంలో 20వేల లీటర్ల వరకు ఫ్రీగా ఉచిత మంచినీటి సరఫరా హామీ ప్రకటించాం. ఈ పథకం శాశ్వతం అని.. పేదలందరికీ ఈ పథకం వర్తిస్తుంది. అపార్ట్ మెంట్ల విషయం కూడా 20వేల లీటర్ల పథకం వర్తిస్తుందని కేసీఆర్ అన్నారు.