Begin typing your search above and press return to search.

కవిత కోసమే కేసీఆర్ ఎమర్జెన్సీ మీటింగ్ నా?

By:  Tupaki Desk   |   25 Feb 2023 11:26 AM GMT
కవిత కోసమే కేసీఆర్ ఎమర్జెన్సీ మీటింగ్ నా?
X
తెలంగాణ సీఎం ఇటీవల వరుబెట్టి అత్యవసర సమావేశాలు నిర్వహిస్తున్నారు. అందుబాటులో ఉన్న ముఖ్య నాయకులను పిలిపించుకొని పలు విషయాలపై చర్చించినట్లు సమాచారం. అయితే వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొనే ఈ మీటింగ్స్ నిర్వహించినట్లు సమాచారం బయటకు పొక్కింది. కానీ రానున్న రోజుల్లో కేంద్రంపై ఎలా పోరు మొదలెట్టాలని హరీష్ రావు, కేటీఆర్ లతో పాటు పలువురు ముఖ్య నాయకులతో కేసీఆర్ చర్చించినట్లు తాజాగా తెలుస్తోంది. ఇటీవల సీబీఐ, ఈడీ దూకుడు పెంచి ఢిల్లీ లిక్కర్ స్కాం కేసును మమ్మరం చేశారు.ఈ కేసుతో సంబంధం ఉన్న వారిలో కొందరిని అరెస్టు చేస్తున్నారు. తాజాగా కవిత వద్ద గతంలో పనిచేసిన గోరంట్ల బుచ్చిబాబును ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన కవిత గురించి ఎలాంటి వివరాలు బయటపెడుతారో.. ఆ తరువాత జరిగే పరిస్థితులు ఎలా ఉంటాయోనన్న దానిపై సమావేశాల్లో చర్చించినట్లు రాజకీయవర్గాల్లో ప్రచారం సాగుతోంది. ఈ మేరకు మీడియాలో హోరెత్తుతోంది..

ఢిల్లీ లిక్కర్ స్కాం రోజుకో మలుపు తిరుగుతోంది. ఎప్పుడు ఎవరిని అరెస్టు చేస్తారో తెలియని పరిస్థితి. ఇన్నాళ్లు కేవలం విచారణ కోసమేనని సీబీఐ అధికారులు చెబుతున్నా.. కొందరిని జ్యూడిషియల్ రిమాండ్ విధిస్తూ ప్రత్యేకంగా విచారిస్తున్నారు. సీబీఐ విచారణ పూర్తి కాగానే ఈడీ అధికారులు కూడా అదుపులోకి తీసుకుంటున్నారు. గతంలో సౌత్ గ్రూప్ లో భాగస్వాములైన శరత్ చంద్రారెడ్డి, అభిషేక్ లను అరెస్టు చేశారు. అయితే వారు బెయిల్ పై బయటకు వచ్చారు. తాజాగా గోరంట్ల బుచ్చిబాబు అరెస్టు చేయడంతో ఆయన ఇచ్చే వివరాల ఆధారంగా కవితను అరెస్టు చేస్తారా? అన్న చర్చ సాగుతోంది.

ఈ తరుణంలో నెక్ పొజిషన్ వస్తే ఏం చేయాలి? అన్న దానిపై చర్చ సాగినట్లు సమాచారం. గోరంట్ల బుచ్చిబాబు తరువాత కవిత ను మరోసారి ఈడీ అధికారులు విచారిస్తారన్న ప్రచారం సాగుతోంది. ఇప్పటికే సీబీఐ అధికారులు కవిత ఇంటికి వెళ్లి మరీ విచారించి పలు విషయాలు సేకరించారు. కానీ ఈడీ అధికారులు విచారిస్తే ఎలా ఎదుర్కోవాలి? అన్నదానిపై మాట్లాడినట్లు తెలుస్తోంది. సీబీఐ చార్జ్ షీట్ లో కవితను కేవలం సాక్షిగానే పేర్కొన్నారు. కానీ కొన్ని వివరాలను రాబట్టేందుకు జ్యూడిషియల్ రిమాండ్ విధిస్తారా? అన్న చర్చ సాగుతోంది.

ఆ పరిస్థితే వస్తే కేంద్రం కావాలనే తెలంగాణపై కక్ష సాధిస్తుందనే ప్రచారం చేయాలని మంత్రుల సమక్షంలో కేసీఆర్ నిర్ణయించినట్లు ప్రచారం సాగుతోంది.. దేశ వ్యాప్తంగా బీఆర్ఎస్ ను ఎదుర్కోలేకనే ఈడీ విచారణ పేరుతో వేధిస్తుందన్నట్లు ప్రచారం చేసే దిశగా ముందుకు వెళ్లాలని అనుకుంటున్నట్లు సమాచారం. ఇక ఇప్పటికే కవిత కేంద్రంపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. బడ్జెట్ నుంచి పేదల విషయంలో కేంద్రం పట్టించుకోవడం లేదని, ఉపాధి హామీ నిధులు ఇవ్వడం లేదని విమర్శిస్తున్నారు. ఒకవేళ కవితను అరెస్టు చేసే పరిస్థితికి వస్తే బీఆర్ఎస్ తరుపున ఎలా రియక్ట్ కావాలన్న అంశంపైనే ఎమర్జెన్సీ మీటింగ్స్ పెట్టినట్లు తెలుస్తోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.