Begin typing your search above and press return to search.

బీజేపీ ఫండింగ్.. టీఆర్ ఎస్ అనుమానాలు..!

By:  Tupaki Desk   |   14 July 2019 12:25 PM GMT
బీజేపీ ఫండింగ్.. టీఆర్ ఎస్ అనుమానాలు..!
X
బీజేపీ.. ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ. ఆ పార్టీకి తిరుగులేదు. వ్యవస్థలన్నీ గుప్పిట పట్టి మొత్తం ఐటీ, ఈడీలతో చెడుగుడు ఆడేస్తున్నారు. అలాంటి బీజేపీతో పెట్టుకోవడానికి ఇప్పుడు ఏ ప్రాంతీయ పార్టీ కూడా సాహసించడం లేదు. బెంగాల్ లో మమతా బెనర్జీ కూడా ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తీరు చూసి షాక్ అయ్యి సైలెంట్ గా ఉన్నారు.

అయితే బీజేపీ సభ్యత్వం వేళ ఆశ్చర్యకర సన్నివేశాలు చోటుచేసుకుంటున్నాయి. పెద్ద ఎత్తున సభ్యత్వాలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఇదే ఇతర పార్టీల నేతలకు అంతుచిక్కడం లేదు.

తెలంగాణలో టీఆర్ ఎస్ పార్టీ కూడా సభ్యత్వాల కార్యక్రమాన్ని చేపట్టింది. కానీ దాన్ని టీఆర్ ఎస్ శ్రేణులు - ఎమ్మెల్యేలు పెద్దగా పట్టించుకున్న దాఖలాలు మాత్రం కనిపించడం లేదు.

అయితే బీజేపీకి మాత్రం పెద్ద ఎత్తున వివిధ వర్గాల వారు వచ్చి సభ్యత్వం తీసుకుంటున్నారు. అయితే సభ్యత్వాలు ఫ్రీగా ఇస్తున్న బీజేపీకి ఫండ్ పేరిట మాత్రం నిధుల వరద పారుతోంది. దీనివెనుక ఉన్న మర్మాన్ని తాజాగా టీఆర్ ఎస్ మంత్రి తలసాని బయటపెట్టి సంచలనం రేపారు.

ఆదివారం మలక్ పేట నియోజకవర్గంలో టీఆర్ ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి తలసాని.. బీజేపీ ఫండింగ్ గురించి నోరు విప్పారు. వ్యాపారవేత్తల చేత బలవంతంగా సభ్యత్వాలు చేయిస్తున్నారని.. వారి నుంచి ఫండింగ్ వసూలు చేస్తున్నారని సంచలన కామెంట్స్ చేశారు. బీజేపీ నిధుల సేకరణ వెనుక ఇలా బెదిరింపులున్నాయని ఆయన మండిపడ్డారు.