Begin typing your search above and press return to search.
కేసీఆర్ ముఖ్యమంత్రిగా కొనసాగే అర్హత లేదు : ఉత్తమ్ ఆగ్రహం!
By: Tupaki Desk | 29 Dec 2020 10:45 AM GMTతెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తాజాగా వ్యవసాయం పై చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నాయి. ఇకపై గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు ఉండవని, ప్రతీ పంటను కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం వ్యాపార సంస్థ కాదని ప్రకటించడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై తాజాగా కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదేమీ మీ జాగీరు కాదని, పండించిన ప్రతీ గింజను కొనుగోలు చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. ప్రజల కోసం కాంగ్రెస్ చివరి క్షణం వరకు పోరాటం చేస్తుంది అని అన్నారు. తెలంగాణ జనాభాలో 60-70శాతం వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారని, ప్రభుత్వ లెక్కల ప్రకారం సుమారం 70లక్షల మంది రైతులు ఉన్నారని , కుటుంబాలతో కలుపుకుంటే దాదాపు 2.5కోట్ల వరకు వీరి జనాభా ఉంటుందన్నారు.
రాష్ట్రంలో మెజారిటీగా ఉన్న ఈ జనాభాను పట్టించుకోలేము అంటే ఇక కేసీఆర్ సీఎంగా ఉండడమెందుకు.. టీఆర్ ఎస్ ప్రభుత్వమెందుకు అని ఉత్తమ్ ప్రశ్నించారు. పండించిన పంటలన్నీ కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం వ్యాపార సంస్థ కాదని పేర్కొనడం సిగ్గుచేటు అని ,అసలు సీఎం గా ఉండటానికి కేసీఆర్ అర్హత లేదని అన్నారు. రైతులు పండించిన ప్రతీ గింజను కొనుగోలు చేస్తామని గతంలో కేసీఆరే హామీ ఇచ్చారని ఉత్తమ్ కుమార్ గుర్తు చేశారు. ఇప్పుడు పంటల కొనుగోలు వల్ల రూ.7500 నష్టం వాటిల్లిందని చెప్పి ఆ బాధ్యత నుంచి తప్పించుకోవాలని చూడటం సరికాదన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పటి కంటే ఎక్కువ అప్పులు చేసిన కేసీఆర్, ఆ డబ్బును ఏం చేశారని ప్రశ్నించారు. కాంట్రాక్టర్లు,బ్రోకర్లకు లక్షల కోట్లు దోచి పెట్టారని ఆరోపించారు.
గ్రామాల్లో ఐకేపీ సెంటర్లతో పంట కొనుగోలు ప్రక్రియ 2004లో కాంగ్రెస్ హయాంలో మొదలైందన్నారు. ఇదేమీ కేసీఆర్ వచ్చాకే మొదలుపెట్టింది కాదన్నారు. ఇదేదో తానే మొదలుపెట్టినట్లు, కరోనా కాలంలో గ్రామాల్లోకి వెళ్లి పంటలు కొనుగోలు చేశామని, కానీ ప్రతీ ఏడాది సాధ్యం కాదని సీఎం ప్రకటనలు ఇవ్వడం సిగ్గుచేటన్నారు. గ్రామాల్లో పంట కొనుగోలు కేంద్రాలను రద్దు చేయాలన్న కేసీఆర్ నిర్ణయానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందన్నారు. రేపటి నుంచి 7వ తారీఖు వరకు మండలాల్లో కాంగ్రెస్ శ్రేణులు నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. 11న జిల్లా కేంద్రాల్లో నిరసనలు ఉంటాయని,18న భారీ కార్యక్రమాన్ని చేపట్టబోతున్నామని చెప్పారు.