Begin typing your search above and press return to search.
ఆ మీడియా మొఘల్ కు కేసీఆర్ ఎన్నో ముచ్చట్లు చెప్పారు
By: Tupaki Desk | 7 Aug 2017 2:02 PM GMTతెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల మీడియాతో ముచ్చటించడం కాస్త తగ్గిపోయిన సంగతి తెలిసిందే. అవసరం అనుకుంటే విలేకరుల సమావేశం నిర్వహించడం లేదంటే తన పని తాను చేసుకుంటూ పోవడం అనేది కేసీఆర్ స్టైల్ అయిపోయింది. వ్యక్తిగతంగా కేసీఆర్ కూడా జర్నలిస్టులతో ముచ్చటించడం లేదు. అయితే ఓ ప్రముఖ మీడియా మొఘల్ కు కేసీఆర్ తో ముచ్చటించే చాన్స్ దొరికింది. ఆయనే హిందూ దినపత్రిక మాజీ ఎడిటర్ ఇన్ చీఫ్ ప్రస్తుత కస్తూరీ అండ్ సన్స్ లిమిటెడ్ చైర్మన్ ఎన్.రామ్. ఈ సందర్భంగా రామ్ కు కేసీఆర్ ఎన్నో ముచ్చట్లు చెప్పారు.
హైదరాబాద్ లోని ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ తో ఎన్.రామ్ సమావేశమై ఇటీవల రాసిన వై స్కామ్స్ ఆర్ హియర్ టు స్టే పుస్తకం సీఎం కేసీఆర్ కు అందజేశారు. ఈ సందర్భంగా సమకాలీన అంశాలతో పాటు, తెలంగాణ ఉద్యమం కొత్త రాష్ట్రం పయనిస్తున్న తీరుపై చర్చించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ను ఎన్ రామ్ పలు ప్రశ్నలు అడిగారు. జీఎస్టీ విధానంపై మీ అభిప్రాయం ఏంటని ఎన్.రామ్ ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా ఒకే పన్ను విధానం ఉండాలనే లక్ష్యంతో పనిచేస్తున్న జీఎస్టీ విధానం ఓ ప్రయోగమని సీఎం కేసీఆర్ తన అభిప్రాయం చెప్పారు.`` జీఎస్టీ ఫలితాలు ఎలా ఉంటాయనేది ఎదురుచూడాల్సి ఉంది. జీఎస్టీ విధానం ఓ ప్రయోగం - చాలా దేశాలు జీఎస్టీ విధానం తెచ్చినయి. కానీ అమలులో ఏర్పడిన ఇబ్బందుల వల్ల చాలా దేశాలు వెనక్కి తగ్గాయి. మన దేశంలో ఏమవుతుందో చూడాలి. పన్నుల శ్లాబుల విషయంలో కూడా భిన్న అభిప్రాయాలున్నాయి. కేంద్రానికి వినతులు అందుతున్నాయి. కేంద్రం ఎలా స్పందిస్తుందో చూడాలి`` అని కేసీఆర్ అన్నారు.
తెలంగాణ ఉద్యమం ఎందుకు చేయాల్సి వచ్చిందనే ప్రశ్నకు సీఎం వివరణాత్మక సమాధానం ఇచ్చారు. సమైక్యపాలనలో తెలంగాణ పట్ల చూపించిన వివక్ష - నిర్లక్ష్యం వల్లనే ప్రత్యేక తెలంగాణ ఉద్యమం చేయాల్సి వచ్చిందని సీఎం వివరించారు. ``1956 హైదరాబాద్ రాష్ర్టాన్ని ఆంధ్ర రాష్ట్రంతో కలిపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటు చేశారు. దీనిపై మొదట్లోనే వ్యతిరేకత వచ్చింది. ఫజల్ అలీ కమిషన్ తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగానే ఉంచాలని సిఫారసు చేసింది. అప్పటి ప్రధాన మంత్రి నెహ్రూ కూడా ఆంధ్రప్రాంతం వారు తెలంగాణ ప్రాంతంతో కలవాలని కోరుకోవడం సామ్రాజ్యవాద విస్తరణ కాంక్ష మాత్రమే అన్నరు. అయినా ఆంధ్రవాళ్లు ఢిల్లో లాబీయింగ్ చేశారు. నిజాం రాజ్యంలో ఉన్న తెలంగాణ నాయకులకు ఢిల్లీతో పరిచయాలు తక్కువ. ఆంధ్రప్రాంతం బ్రిటీష్ రాజ్యంలో ఉండడం వల్ల వారు మొదటి నుంచి ఢిల్లీ వారితో సన్నిహితంగా ఉండేవారు. ఢిల్లీలో లాబీయింగ్ చేసి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేశారు. కాని కేవలం తొమ్మిది నెలల్లోనే ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. తెలంగాణ ప్రాంతంలో ఆందోళన మొదలైంది. 1966లో నిరసన ప్రారంభమైంది. 1969 నాటికి మర్రి చెన్నారెడ్డి నాయకత్వంలో ఉధృతమైంది. సమైక్య పాలనలో రోజురోజుకూ వివక్ష ఎక్కువైందే తప్ప తక్కువ కాలేదు. ఎస్టీఆర్ పార్టీ పెట్టిన వెంటనే కొత్త రాజకీయం వచ్చింది. నేను కూడా టీడీపీలో చేరిన, దాదాపు రెండు దశాబ్దాలు ఎమ్మెల్యేగా పనిచేసిన. మంత్రిగా కూడా పనిచేసిన. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు మంత్రిగా పనిచేసిన. తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై నిత్యం పంచాయితీ పెట్టుకునే వాడిని. 1999లో కరెంటు ఛార్జీలు పెంచడంతో రైతులు బాగా నష్టపోతారని చెప్పిన. అయినా వినలేదు, దీంతో నేను పదవులు వదిలి ఉద్యమం మొదలు పెట్టాను`` అని కేసీఆర్ సుదీర్గ వివరణ ఇచ్చారు.
సమైక్యాంధ్ర చివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నిండు అసెంబ్లీలో తెలంగాణకు ఒక్క రూపాయి ఇవ్వను అని ప్రకటించారని ఇది ఆంధ్ర పాలకుల గర్వానికి, అహంకారానికి నిదర్శనమని కేసీఆర్ మండిపడ్డారు. వివక్ష, నిర్లక్ష్యం అన్ని రంగాల్లో కొనసాగిందని ఈ క్రమంలో తెలంగాణ ప్రజలు ఉద్యమించి ప్రత్యేక రాష్ట్రం సాధించారని తెలిపారు. ఉద్యమ సమయంలో తాము అనేక మార్లు చెప్పినట్లే తెలంగాణ రాష్ట్ర ఆదాయ వృద్ధిరేటులో ముందంజలో ఉందని కేసీఆర్ తెలిపారు. కృష్ణ, గోదావరి నదుల్లో నీటిని సద్వినియోగం చేసుకోవడంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాలు బాగుపడతాయని ఆయన వివరించారు.