Begin typing your search above and press return to search.
బాబుకు మెమరీ తక్కువని కేసీఆర్ తేల్చారే!
By: Tupaki Desk | 14 Dec 2015 2:18 PM GMTఇద్దరు చంద్రుళ్ల మధ్య భేటీ సందర్భంగా ఆసక్తికర అంశాలకు కొదవ లేదు. అయుత చండీయగానికి ఆహ్వానం పలకటానికి వచ్చిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిని కుశల ప్రశ్నలు అడిగే క్రమంలో చంద్రబాబు అడ్డంగా దొరికిపోయారు. ఆయనకు మెమరీ కాస్తతక్కువేనన్న విషయాన్ని కేసీఆర్ చెప్పకనే చెప్పేశారు. ఊహించని పరిణామంతో బాబు కాస్త కవర్ చేసుకోవటానికి ట్రై చేసినా.. కెమేరా కంటికి దొరికిపోయారనే చెప్పాలి.
అయుత చండీయాగానికి సంబంధించిన వివరాల్ని కేసీఆర్ చెప్పటం.. ఇదే సమయంలో చంద్రబాబు కల్పించుకొని.. మీరు తెలుగుదేశంలో ఉన్నప్పుడు ఇలాంటి యాగాలు చేసినట్లు లేరే అన్న అనటం.. ఆ వెంటనే కేసీఆర్ లేదు.. అప్పుడూ చేశానని టక్కున బదులివ్వటం జరిగిపోయాయి.
దీంతో.. బాబు నోట మాట రాలేదు. తన పార్టీ నేత.. అందునా తనకు కాస్తంత క్లోజ్‌గా ఉండే వ్యక్తికి సంబంధించిన వివరాలు కూడా బాబు తెలుసుకోలేదా? అన్నది ఒక ప్రశ్న అయితే.. ఆయనకు పాత విషయాలు గుర్తు లేవన్న విషయం తాజా ఉదంతంతో తేలిపోయింది.
తన యాగం గురించి మాట్లాడుతూ.. తాను గతంలో చండీయాగాలు చేసినప్పుడు మీడియా ఇప్పుడున్నంత యాక్టివ్ గా లేదని.. దీంతో పెద్దగా ఫోకస్ కాలేదని.. ఈసారి మాత్రం బాగా ప్రచారం జరుగుతుందని చెప్పారు. నిజమే మరి.. అప్పట్లో కేసీఆర్ చండీయాగం చేస్తే.. చుట్టాలు మాత్రమే వచ్చి ఉంటారు. కానీ.. ఇప్పుడు దేశ రాష్ట్రపతి.. ముఖ్యమంత్రులు వస్తున్నారు కదా. హోదాను అనుసరించే కార్యక్రమం రేంజ్ మారిపోతుందన్న విషయం కేసీఆర్ కు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదేమో..?