Begin typing your search above and press return to search.
కేసీఆర్ ఫాంహౌజ్ లో ఏం జరుగుతుందో తెలుసా?
By: Tupaki Desk | 5 April 2016 6:04 AM GMTతన విశ్రాంతి కేంద్రమైన ఫాంహౌజ్ కు ఒకింత సుదీర్ఘ సమయం తర్వాత వెళ్లిన తెలంగాణ సీఎం కేసీఆర్ ఇపుడు ఏం చేస్తున్నారు? పార్టీకి సంబంధించిన కీలక అడుగులు వేయడంలో ఆయన బిజీగా మారిపోయారా? కేసీఆర్ వ్యవసాయ క్షేత్రం కేంద్రంగా రెండేళ్ల నుంచి పెండింగ్ లో ఉన్న ఓ కీలక నిర్ణయానికి మోక్షం దక్కనుందా? టీఆర్ ఎస్ లోని విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు అవుననే సమాధానం వస్తోంది.
టీఆర్ ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు రెండు సంవత్సరాలకు దగ్గర పడుతుండటంతో ఇక నామినేటేడ్ పోస్టుల భర్తీలో ఏమాత్రం తాత్సారం చేయవద్దని గులాబీ దళపతి - ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు భావిస్తున్నట్టు పార్టీ వర్గాల సమాచారం. గత ఏడాది నుంచి వీటిని భర్తీ చేయాలని ముఖ్యమంత్రి భావించినప్పటికీ ఏదో ఒక అవాంతరం ఎదురుపడటంతో ఎప్పటికప్పుడు వాయిదా వేస్తూ వచ్చారు. అయితే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ - గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ - ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ తో పాటు ఇతర స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు బడ్జెట్ సమావేశాలు కూడా ముగియడంతో ఇక పోస్టుల భర్తీ పట్ల ముఖ్యమంత్రి దృష్టి సారించారు. తెలంగాణలోని నామినేటేడ్ పోస్టుల భర్తీకి ఉగాది పండుగ నుంచి శ్రీకారం చుట్టడానికి కేసీఆర్ సన్నద్ధం అవుతున్నారని సమాచారం.
జిల్లాస్థాయిలో వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గాలకు - జిల్లా గ్రంధాలయాల కమిటీ చైర్మన్ - దేవాలయాల పాలక వర్గాలకు ఎంపిక చేసే బాధ్యతలను పార్టీ జిల్లా బాధ్యులు, సంబంధిత జిల్లా మంత్రుల సమన్వయంతో ప్రతిపాదనలు పంపించాలని కేసీఆర్ ఇప్పటికే ఆదేశించారు. అయితే శాసనసభ బడ్జెట్ సమావేశాల వల్ల బిజీగా ఉండిపోయిన మంత్రులు ఆ దిశగా కసరత్తు చేయలేకపోయారు. ఈ సమావేశాల తర్వాత జిల్లాలకు వెళ్లిన మంత్రులు నామినేటేడ్ పోస్టుల భర్తీకి కసరత్తు ప్రారంభించినట్టు తెలిసింది. జిల్లా స్థాయి నామినేటేడ్ పోస్టులు మినహాయించి రాష్టస్థ్రాయిలో భర్తీ చేయాల్సిన పోస్టులు నలబై వరకు ఉంటాయని ప్రాథమిక అంచన. వీటిలో కనీసం 15 నుంచి 20 కార్పొరేషన్ చైర్మన్ పోస్టులు కేబినేట్ హోదా కలిగి ఉన్నాయి. వీటి భర్తీకి ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చారని, అయితే పార్టీ ముఖ్యనేతలతో కూడా ఒక్కసారి చర్చించాక ప్రకటించాలని భావిస్తున్నట్టు తెలిసింది.
ఈ క్రమంలో తాజాగా తన ఫాంహౌజ్ లో నామినేటెడ్ పదవుల గురించి తుది కసరత్తు పూర్తిచేసి ఉగాది తీపికబురు అందించేందుకు కేసీఆర్ సన్నద్ధం అవుతున్నారని గులాబీ వర్గాలు అంటున్నాయి. గతంలో వివిధ హామీలు పొందిన వారు, ఎన్నికల్లో పోటీ చాన్స్ దక్కని నాయకులు, పార్టీ మారిన వారికి ఈ పందేరంలో గుడ్ న్యూస్ దక్కనుందని టీఆర్ ఎస్ లోని విశ్వసనీయవర్గాల సమాచారం.