Begin typing your search above and press return to search.

సారు.. డైరెక్ట్‌ గా లైన్లోకి వ‌చ్చేస్తున్నార‌ట‌!

By:  Tupaki Desk   |   23 Oct 2018 9:37 AM GMT
సారు.. డైరెక్ట్‌ గా లైన్లోకి వ‌చ్చేస్తున్నార‌ట‌!
X
ముఖ్య‌మంత్రిగా ఉన్నా.. అప‌ద్ద‌ర్మ ముఖ్య‌మంత్రిగా ఉన్నా కేసీఆర్ త‌న తీరు మార్చుకోవ‌టం లేదు. అధికారంలో ఉన్న‌ప్పుడు ఎలా అయితే ఫామ్ హౌస్ లో కాలం గ‌డిపేవారో.. కీల‌క‌మైన ఎన్నిక‌ల వేళ‌లోనూ ఆయ‌న ఫామ్ హౌస్ నుంచే పావులు క‌దుపుతున్నారు. ముఖ్య‌మైన కార్య‌క్ర‌మాలు.. కీల‌క‌మైన ప‌నులు ప‌డితే త‌ప్పించి మొత్తం క‌థంతా ఫామ్ హౌస్ నుంచే సాగుతున్న‌ట్లుగా చెబుతున్నారు.

ఎన్నిక‌ల బ‌రిలో టికెట్లు పొందిన అభ్య‌ర్థుల‌ను తాజాగా కేసీఆర్ వ‌ణికిస్తున్న‌ట్లుగా తెలుస్తోంది. జిల్లాల వారీగా.. ఒక టైంను ఫిక్స్ చేసి.. ఆ టైంలో రోజూ ఫోన్ చేయ‌టం కేసీఆర్ కు అల‌వాటుగా మారిందంటున్నారు. ఉదాహ‌ర‌ణ‌కు వ‌రంగ‌ల్ జిల్లాల బ‌రిలో ఉన్న టీఆర్ ఎస్ నేత‌ల‌తో రోజూ సాయంత్రం వేళ‌లో అభ్య‌ర్థుల‌తో ఫోన్లో మాట్లాడుతున్నారు. ఇలా కొన్ని జిల్లాల మీద ప్ర‌త్యేకంగా దృష్టి సారించిన గులాబీ బాస్ ఫోన్ కాల్ అంటే చాలు అభ్య‌ర్థులు హ‌డ‌లిపోతున్న ప‌రిస్థితి.

ఎమ్మెల్యేగా ఉన్న నాలుగున్న‌రేళ్ల‌లో కూడా తాము ఇన్నిసార్లు కేసీఆర్‌ తో నేరుగా ఫోన్లో మాట్లాడి ఉండ‌మ‌ని.. అలాంటిది ఎన్నిక‌ల వేళ ఆయ‌న నేరుగా ట‌చ్ లోకి రావ‌టంపై ఒకింత ఆనందంతో పాటు.. భ‌యాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. ఫోన్ చేసేది ప‌రామ‌ర్శ‌ల‌కు కాకుండా.. నేరుగా పాయింట్లోకి రావ‌టం.. ప్ర‌చారం ఎలా జ‌రిగింది? ప్ర‌జ‌లు ఏమ‌నుకుంటున్నారు? ప్ర‌జ‌ల్నిబాగా ఆక‌ర్షించిన ప్ర‌భుత్వ ప‌థ‌కం ఏమిటి? ప్ర‌భుత్వం త‌ప్పొప్పుల మీద ఆయ‌న వేస్తున్న ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు చెప్పేందుకు అభ్య‌ర్థులు కిందా మీదా ప‌డుతున్నారు.

అభ్య‌ర్థులు చెప్పే మాట‌ల్ని గుడ్డిగా న‌మ్మ‌కుండా.. ఆ ప్ర‌శ్న‌ల‌కు సంబంధించి త‌న ద‌గ్గ‌ర క‌చ్ఛిత‌మైన స‌మాచారం ఉంద‌న్న విష‌యాన్ని అభ్య‌ర్థుల‌కు కేసీఆర్ తెలిసేలా చేస్తున్న‌ట్లు చెబుతున్నారు. దీంతో.. నోటికి వ‌చ్చిన‌ట్లు కాకుండా అలెర్ట్ గా స‌మాధానాలు ఇవ్వాల్సి వ‌స్తోందంటున్నారు. కొంత‌మంది సీరియ‌స్ గా ప్ర‌చారం చేయ‌కుంటే.. ఆ విష‌యాన్ని వారికి చెప్ప‌ట‌మే కాదు.. హెచ్చ‌రిక‌లు కూడా చేస్తున్న‌ట్లు చెబుతున్నారు.

మొత్తంగా అధినేత నేరుగా మానిట‌ర్ చేస్తున్న వైనం ఇప్పుడు అభ్య‌ర్థుల‌కు పెద్ద సంక‌టంగా మారింది.ఏ ప్ర‌శ్న‌ను ఎప్పుడు అడుగుతారో అర్థంకాన‌ట్లుగా మారిందంటున్నారు. కేసీఆర్ నుంచి నేరుగా ఫోన్ కాల్స్ వ‌స్తున్న నేప‌థ్యంలో అభ్య‌ర్థులు ప‌రుగులు పెడుతూ ప్ర‌చారం చేస్తున్నారు. అధినేత నుంచి ఎప్పుడు ఎలాంటి ఫోన్ కాల్ వ‌స్తుంద‌న్న‌ది ఇప్పుడు అర్థం కావ‌టం లేద‌ని గులాబీ అభ్య‌ర్థులు చెబుతున్నారు.