Begin typing your search above and press return to search.

కేసీఆర్ ఢిల్లీ టూర్.. ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయబోతున్నారా?

By:  Tupaki Desk   |   19 March 2022 4:24 PM GMT
కేసీఆర్ ఢిల్లీ టూర్.. ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయబోతున్నారా?
X
తెలంగాణ సీఎం కేసీఆర్ ఎప్పుడు ఏది చేసినా దాని వెనుక ఓ అర్థం పరమార్థం ఉంటుందని చెబుతున్నారు. గత 2018లో కూడా కేసీఆర్ ఇలా ప్రతిపక్షాలు ఇతరులకు తెలియకుండా సడెన్ గా ఢిల్లీ టూర్ పెట్టుకున్నారు. మోడీ, అమిత్ షాలను కలిసి హైదరాబాద్ రాగానే తెలంగాణలో ముందస్తు ఎన్నికలు ప్రకటించారు.

ఇప్పుడు కూడా కేసీఆర్ అచ్చం అలాంటి సంఘటనలే పునరావృతం చేయడంతో మరోసారి తెలంగాణలో ముందస్తు ఎన్నికలు తప్పవా? అన్న చర్చ సాగుతోంది. తాజాగా సీఎం కేసీఆర్ అర్జంట్ గా ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టినట్టు మీడియాలో పెద్దఎత్తున వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు ఫాంహౌస్ కు మంత్రులను పిలిపించారని.. అందరూ తరలివచ్చారని అంటున్నారు. మంత్రులతో కేసీఆర్ ఎందుకు సమావేశం పెట్టారన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం కేసీఆర్ కాలపరిమితి రెండేళ్లే ఉంది. మరో రెండేళ్లలో కేసీఆర్ దిగిపోతారు. అయితే మీకు 5 ఏళ్లు పదవీ కాలం కావాలంటే ఇప్పుడే ఎన్నికలకు వెళ్లాలని.. ముందస్తుగా వెళితేనే విజయం దక్కుతుందని కేసీఆర్ మంత్రులతో అన్నట్టు మీడియాలో మీడియాలో ప్రచారం సాగుతోంది.

ఇక లేదంటే ఇప్పుడు ఫుల్ టైం 2023వరకూ ఉంటే తర్వాత గెలుపు కష్టమని ప్రశాంత్ కిషోర్ టీం నివేదించినట్టుగా చర్చ సాగుతోంది. టీఆర్ఎస్ ప్రభుత్వం ఫుల్ టైం ఉండాలంటే నెక్ట్స్ ఎన్నికల్లో మన పరిస్థితి రెండు దఫాల వ్యతిరేకత ఉండే పరిస్థితి ఉంటుందని కేసీఆర్ హెచ్చరించినట్టు టాక్ నడుస్తోంది. అందుకే ఇప్పుడే ఎన్నికలకు వెళితే ఆ వ్యతిరేకత అధిగమించవచ్చని కేసీఆర్ డిసైడ్ అయినట్టుగా మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. మంత్రులతో భేటి తర్వాత కేసీఆర్ ఢిల్లీ టూర్ పెట్టుకోవడంతో ఇప్పుడు ఆ ఊహాగానాలు మరింత జోరందుకున్నాయి. కేసీఆర్ ఢిల్లీ పెద్దలను కలిసి వచ్చాక ముందస్తు ఎన్నికలకు వెళతారని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటన ఖారారైంది. ఈనెల 21న ఢిల్లీ వెళ్లనున్న కేసీఆర్, మంత్రుల బృందం, ప్రధాని మోడీ సహా పలువురు కేంద్రమంత్రులను కలవనుంది. పంజాబ్ తరహాలో తెలంగాణలోనూ పూర్తిస్థాయిలో ధాన్యం కొనుగోళ్లు చేయాలని కేంద్రప్రభుత్వాన్ని కేసీఆర్ కోరనున్నారు. అటు ఈనెల 21న టీఆర్ఎస్ ఎల్పీ సమావేశం జరుగనుంది. ఆ తర్వాత కేసీఆర్ ఏదో ఒక కీలక నిర్ణయం తీసుకుంటారని అందరూ భావిస్తున్నారు.

కేసీఆర్ ఢిల్లీ టూర్ నేపథ్యంలో తెలంగాణ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. కేసీఆర్ ప్రధాని మోడీ, అమిత్ షాలను కలిశాక తెలంగాణకు ముందస్తు ఎన్నికలు ప్రకటిస్తారని.. ఈ మేరకు 2018 నాటి సంఘటనలే పునరావృతం అవుతున్నాయని ప్రతిపక్షాలు అనుమానిస్తున్నాయి.

ఇప్పటికే పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితోపాటు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా తెలంగాణలో కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళతారని ఆరోపించారు. ఇప్పుడు కేసీఆర్ అడుగులు అటే పడుతున్నాయని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. మరి కేసీఆర్ వెళ్లేది ముందస్తు ఎన్నికలకా? లేక నిజంగానే సమస్యలపై పోరాడుతారా? అన్నది వేచిచూడాలి.