Begin typing your search above and press return to search.
రాజకీయాలకు కొత్త భాష్యం చెప్పిన కేసీఆర్
By: Tupaki Desk | 9 Nov 2017 5:30 PM GMTతెలంగాణ ముఖ్యమంత్రి - టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ రాజకీయాలపై ఎలా స్పందిస్తారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇటు రాజకీయాలు చూసుకున్నా అటు పరిపాలన తీరు అయినా...ఆయన శైలి విభిన్నం. అలా ప్రత్యేకమైన రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ అయిన కేసీఆర్..తాజాగా రాజకీయాలకు కొత్త భాష్యం చెప్పారు. అసెంబ్లీలో మైనార్టీ సంక్షేమంపై మాట్లాడిన ఆయన ఇతరులకు రాజకీయాలు గేమ్ ..మాకు మాత్రం టాస్క్ అని అన్నారు.
రాజకీయాల్లో భాగంగా...మొదటి టాస్క్ తెలంగాణ సాధించడం పూర్తయ్యిందని - రెండో టాస్క్ తెలంగాణ పునర్ నిర్మాణమని అది జరుగుతోందని సీఎం కేసీఆర్ చెప్పారు. ``నిజాం సమాధిని దర్శిస్తే ఆనాడు తనను పనిగట్టుకొని విమర్శించారు. మీరు కాటన్ దొరను పూజిస్తే.. మేం నిజాం రాజును గౌరవించొద్దా..?`` అంటూ ప్రశ్నించారు. `నిజాం తెలంగాణ రాజు.. తెలంగాణ చరిత్ర` అని కేసీఆర్ స్పష్టం చేశారు. మైనార్టీ సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్న కేసీఆర్ ..కరీంనగర్ మేయర్ గా ఒక సిక్కు వ్యక్తిని నియమించిన ఘనత మా ప్రభుత్వానిదని అన్నారు. తెలంగాణ ప్రాంతం గొప్ప దైవ భూమి అన్న కేసీఆర్ ..క్రిస్మస్ - రంజాన్ - బోనాలను ఘనంగా నిర్వహించామని వెల్లడించారు. వక్ఫ్ బోర్డు దగ్గర భూముల లెక్కలే లేవని, అందుకే వక్ఫ్ బోర్డును సీజ్ చేయాలని ఆదేశించామని అన్నారు. తెలంగాణలోని ప్రతీ ఎమ్మెల్యే మైనార్టీల సంక్షేమం కోసం కృషి చేస్తున్నారన్న కేసీఆర్ .. మైనార్టీ రిజర్వేషన్ల విషయంలో ఏకాభిప్రాయంతో ముందడుగు వేద్దామని కోరారు. రిజర్వేషన్లను రాజకీయం చేయడం లేదని, టాస్క్‌గా తీసుకున్నామని సీఎం కేసీఆర్ అన్నారు. ముస్లింలలో ధనికులు, పేదలూ ఉన్నారన్నారు. ముస్లింలలో వెనుకబడిన వారికే రిజర్వేషన్లు కల్పిస్తామని కేసీఆర్ తెలిపారు.
తమిళనాడు తరహాలో ముస్లింలకు రిజర్వేషన్లు కల్పిస్తామని సీఎం కేసీఆర్ అన్నారు. రిజర్వేషన్లపై ప్రధానితో మాట్లాడానని, సానుకూలత వ్యక్తం చేశారన్నారు. ముస్లింల రిజర్వేషన్ కేంద్రం పరిశీలనలో ఉందన్నారు. వచ్చే శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో మైనార్టీ రిజర్వేషన్లపై మా ఎంపీలు పోరాటం చేస్తారన్నారు. కాంగ్రెస్ పదేళ్ల పాలనలో మైనార్టీలకు రూ.932 కోట్లు ఖర్చుచేసింది. కానీ ఈ మూడేళ్ల పాలనలో మా ప్రభుత్వం రూ.2,146 కోట్లు ఖర్చు చేసిందని సీఎం స్పష్టం చేశారు. కేంద్రం చాలా విషయాలను రాష్ర్టాలకు బదలాయించాల్సి ఉందని సీఎం కేసీఆర్ తెలిపారు.