Begin typing your search above and press return to search.
పర్సనల్ ఇంట్రస్ట్ ల గురించి చెప్పిన కవిత
By: Tupaki Desk | 12 March 2016 11:49 PM ISTతెలంగాణ సంస్కృతి గురించి చెప్పమంటే నాన్ స్టాప్ గా చెప్పే ఎంపీ కవిత.. అంతే దూకుడుగా రాజకీయ ఉపన్యాసాలు చేయగలరు కూడా. మొన్నటి మొన్న జైట్లీ ప్రవేశ పెట్టిన బడ్జెట్ మీద లోక్ సభలో ఆమె ప్రసంగాన్ని విన్న వారంతా ఆమెను మెచ్చుకున్న వారే. సునిశితంగా బడ్జెట్ మీద విమర్శలు చేశారు. కొన్ని విషయాలు ప్రస్తావిస్తూ చేసిన విమర్శల్ని జైట్లీ జాగ్రత్తగా వినటం కనిపించింది.
ఇలా సమస్యల మీద తరచూ గళం విప్పే ఎంపీ కవిత.. తన వ్యక్తిగత అభిరుచుల గురించి మాట్లాడేది కాస్త తక్కువే. తాజాగా ఆ లోటును తీరుస్తూ ఆమె చెప్పిన కొన్ని ముచ్చట్లు ఆసక్తికరంగా ఉన్నాయి. తనకు వంట చేయటం అంటే చాలా ఇష్టమని... కానీ వంట చేసే టైం తనకు దొరకటం లేదన్న విషయాన్ని ఆమె చెప్పుకొచ్చారు. జస్టిస్ సుభాషణ్ రెడ్డితో కలిసి ఒక రెస్టారెంట్ ను ప్రాంరభించిన సందర్భంగా ఆమె తన అభిరుచుల్ని చెప్పుకొచ్చారు.
బంగ్లా కోడి కూర అంటే తనకుచాలా ఇష్టమన్న ఆమె.. హైదరాబాద్ వంటకాలకు దేశంలో ప్రత్యేక గుర్తింపు ఉందని చెప్పారు. హైదరాబాద్ లో 50 రకాల బిర్యానీలు దొరుకుతాయని కవిత వెల్లడించారు. రాజకీయాల్లో నిత్యం బిజీగా ఉండే కవితక్క గరిటె పట్టుకోవటం ఇప్పట్లో సాధ్యమయ్యే పని కాదనే చెప్పాలి.