Begin typing your search above and press return to search.
సెప్టెంబరు 17 నుంచి కేసీఆర్ కు కౌంట్ డౌన్ స్టార్ట్
By: Tupaki Desk | 10 Aug 2019 5:30 AM GMTతెలంగాణ రాజకీయాల్లో ప్రబల శక్తిగా ఎదిగిన సీఎం కేసీఆర్ రాజకీయ జోరుకు బ్రేకులు పడనున్నాయా.. మరో నెల రోజుల తరువాత కేసీఆర్‌కు కష్టాలు మొదలు కానున్నాయా అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. రాజకీయంగా బాగా కండపట్టిన బీజేపీ తన బలమేంటో కేసీఆర్ కు చూపించడానికి సిద్ధమవుతోందని ఆ పార్టీ తీసుకుంటున్న నిర్ణయాలను బట్టి అర్థమవుతోంది. ముఖ్యంగా తెలంగాణలో వచ్చే ఎన్నికల నాటికి పూర్తిగా బలపడి అధికారం అందుకోవాలని కలగంటున్న ఆ పార్టీ ఆ కలలను ఏమాత్రం లైట్ గా తీసుకోకుండా ఆ కల సాకారం కోసం ప్రతి చిన్న అవకాశాన్నీ ఉపయోగించుకుంటోంది. ఆ క్రమంలోనే కేసీఆర్ ను ఇరుకునపెడుతూ ప్రజల్లో తెలంగాణ సెంటిమెంటును మరోసారి రగిల్చేలా వచ్చేనెల 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని భారీ ఎత్తున నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తోంది. ఆ రోజు భారీ బహిరంగ సభ నిర్వహించి అమిత్ షా అక్కడ ప్రసగించబోతున్నారు కూడా. అది కూడా ఉత్తర తెలంగాణలోని నిజామాబాద్ లో నిర్వహించాలని డిసైడయ్యారు. ఈ పరిణామం కేసీఆర్ కు ఏమాత్రం మింగుడుపడడం లేదట.
తెలంగాణలో ఇప్పటికే నాలుగు ఎంపీ సీట్లు గెలుచుకున్న బీజేపీకి జమ్ము-కశ్మీర్ లో అధికరణ 370 రద్దు.. కశ్మీర్- లద్దాఖ్ రెండు కేంద్రపాలిత ప్రాంతాలను ఏర్పాటుచేస్తూ ఎన్డీయే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అనంతరం మరింత ఆదరణ పెరుగుతోందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. కిషన్ రెడ్డికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి పదవి దక్కడం కూడా తెలంగాణలో బీజేపీకి ఊపు తెచ్చింది. ఈ నేపథ్యంలో వచ్చే నెలలో తెలంగాణ విమోచన దినం నిర్వహిస్తే అది ఎంఐఎం వంటి పార్టీలతో అంటకాగే కేసీఆర్ కు కష్టాలు తేవడంతో పాటు నిజమైన తెలంగాణ వాదుల్లో బీజేపీ పట్ల ఆదరణా పెంచుతుంది.
దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ హైదరాబాద్ సంస్థానం మాత్రం వెంటనే దేశంలో విలీనం కాలేదు. దాంతో 1948 సెప్టెంబరులో అప్పటి హోం మంత్రి వల్లబాయి పటేల్ సైనిక చర్యకు దిగడంతో నిజాం 1948 సెప్టెంబరు 17న లొంగిపోయాడు. దాంతో హైదరాబాద్ భారతదేశంలో విలీనమైంది. ఆ రోజును తెలంగాణ విమోచన దినంగా జరుపుకొంటారు. కానీ, కేసీఆర్ సర్కారు గానీ టీఆర్ ఎస్ పార్టీ కానీ దీనికి ప్రాధాన్యమివ్వడం లేదు. రాజకీయ అవసరాలతోనే ఆ పార్టీ అలాంటి వ్యూహం అనుసరిస్తోంది. ఇప్పుడు బీజేపీ కనుక తెలంగాణ విమోచన దినం నిర్వహిస్తే జనంలో బీజేపీ పట్ల సానుకూలత రావడం ఖాయమన్న అభిప్రాయం వినిపిస్తోంది.
బీజేపీ కూడా విమోచన దినం నిర్వహించిన తరువాత పార్టీని విస్తరించేందుకు వేగంగా అడుగులు వేయడానికి ప్రణాళికలు రచించుకుంటోంది. ముఖ్యంగా సీనియర్, జూనియర్ అన్న తేడా లేకుండా ఇతర పార్టీల నాయకులను బీజేపీలో చేర్చుకునే వ్యూహాన్ని అమలు చేయనుంది. ఆ క్రమంలో టీఆర్ ఎస్ నుంచి కొందరు కీలక నేతలను కూడా బీజేపీలోకి లాగే అవకాశం ఉందని సమాచారం.