Begin typing your search above and press return to search.

మీడియా ఆఫీసుల్లో కేసీఆర్ లొల్లి!

By:  Tupaki Desk   |   23 Aug 2018 6:11 PM GMT
మీడియా ఆఫీసుల్లో కేసీఆర్ లొల్లి!
X
పిల్లికి చెల‌గాటం.. ఎలుక‌కు ప్రాణ సంక‌టంగా మారింది తెలంగాణ పొలిటిక‌ల్ జ‌ర్న‌లిస్టుల ప‌రిస్థితి. ద‌శాబ్దాల నుంచి రిపోర్టింగ్ చేస్తున్న వారికి సైతం చుక్కలు చూపిస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్‌. సామాన్యుల్లో చాలామందికి.. రెగ్యుల‌ర్ గా పత్రిక‌లు చదివే వారికే కాదు.. ప‌త్రికాఫీసుల్లో ప‌ని చేసే చాలామంది జ‌ర్న‌లిస్టుల‌కు తెలీని రీతిలో పొలిటిక‌ల్ రిపోర్ట‌ర్ల హ‌వా న‌డుస్తుంటుంది.

ఏ పత్రికాఫీసులో అయినా..గ్లామ‌ర్ ఉండే పోస్టులు రెండే.. ఒక‌టి పొలిటిక‌ల్ రిపోర్ట‌ర్లు.. మ‌రొక‌రు సినిమా రిపోర్ట‌ర్లు. ఈ పొలిటిక‌ల్ రిపోర్ట‌ర్లు బ‌య‌ట‌కు క‌నిపించినంత సామాన్యంగా ఉండ‌రు. సీఎం ద‌గ్గ‌ర నుంచి ఎమ్మెల్యే వ‌ర‌కూ అంద‌రూ సెల్ ఫోన్ కాల్ దూరంలో ఉంటారు. సీఎం కూడానా? అన్న ఆశ్చ‌ర్యం అక్క‌ర్లేదు. అంద‌రికి కాకున్నా.. కొంద‌రు ముఖ్య రిపోర్ట‌ర్ల‌కు మాత్రం. అయితే.. తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ ఇందుకు మిన‌హాయింపుగా చెప్పాలి. ఆయ‌న‌తో ఫోన్లో మాట్లాడాలంటే పెద్ద త‌తంగ‌మే ఉంటుంది.

ఇంత‌కీ పొలిటిక‌ల్ రిపోర్ట‌ర్ల గురించి ఇంత ప‌రిచ‌యం ఎందుకంటారా? దానికో కార‌ణం లేక‌పోలేదు. తెలంగాణ సీఎం కేసీఆర్ పుణ్య‌మా అని పొలిటిక‌ల్ రిపోర్ట‌ర్ల‌కు వారి చీఫ్ ల‌కు చుక్క‌లు క‌నిపిస్తున్నాయి. ముంద‌స్తు జ‌రుగుతుందా? లేదా? అన్న దాని మీద ప‌త్రిక‌ల్లో వ‌స్తున్న క‌థ‌నాల మీద ప‌త్రికాఫీసుల్లో పెద్ద ఎత్తున పంచాయితీలు జ‌రుగుతున్న‌ట్లుగా తెలుస్తోంది.

ఈ రోజు ఉద‌యం దిన‌ప‌త్రిక‌ల్ని చూస్తే.. మంత్రివ‌ర్గ స‌మావేశంలో కేసీఆర్ మాష్టారు ఏం చెప్పార‌న్న అంశానికి సంబంధించి ఒక పేప‌ర్ కి.. మ‌రో పేప‌ర్ కి సంబంధం లేన‌ట్లుగా వార్త‌లు అచ్చ‌య్యాయి. ముంద‌స్తు అన్న ప‌దాన్ని వాడ‌కుండా ఎన్నిక‌ల‌కు సిద్ధంకండి అంటూ ఆంధ్ర‌జ్యోతి ఇవ్వాల్సిన ఇండికేష‌న్ ను తెలివిగా ఇస్తే.. ముంద‌స్తు లేద‌న్న మాట చెప్పిన ఈనాడు అడ్డంగా బుక్ అయ్యింది. ఇక‌..సాక్షి దిన‌ప‌త్రిక మాత్రం క‌ర్ర విర‌గకుండా.. పాము చావ‌ని రీతిలో ఎన్నిక‌ల నిర్ణ‌యాధికారం కేసీఆర్ చేతికే అంటూ చెప్పింది. ఒక‌ర‌కంగా చెప్పాలంటే సేఫ్ గేమ్ ఆడింది. విచిత్రంగా ఇంగ్లిషు ప‌త్రిక‌లు టైమ్స్.. హిందూ లాంటివి కూడా మంత్రివ‌ర్గ స‌మావేశంలో కేసీఆర్ ఏం చెప్పార‌న్న విష‌యాన్ని చెప్ప‌లేక‌పోయారు.

ఇదిలా ఉంటే.. ఒక పేప‌ర్ కి.. మ‌రో పేప‌ర్ కి సంబంధం లేకుండా క‌థ‌నాలు రావ‌టంతో ఎవ‌రిది క‌రెక్ట్ అన్న దానిపై ఈ రోజు ఉద‌యం నుంచి పంచాయితీలు జ‌రుగుతున్నాయి. ముంద‌స్తు లేద‌న్న మాట‌ను చెప్పేసిన ప్ర‌ముఖ ప‌త్రిక‌లో అయితే.. త‌లంటు కార్య‌క్ర‌మం భారీగా ఉన్న‌ట్లు స‌మాచారం.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఈ రోజు (గురువారం) రాత్రి 8.30 గంట‌ల త‌ర్వాత నుంచి ముంద‌స్తుకు వెళ్లేందుకు కేసీఆర్ సిద్ధంగా ఉన్నారంటూ ప్ర‌ముఖ ఛాన‌ల్ ఒక‌టి తేల్చేసింది.దీంతో.. ఉద‌యం పేప‌ర్లో ముంద‌స్తు లేద‌న్న వార్త‌ను ఇచ్చిన వారితో పాటు.. కర్ర విర‌గ‌కుండా.. పాము చావ‌కుండా క‌థ‌నం ఇచ్చిన వారికి క్లాసులు ప‌డుతున్న‌ట్లుగా తెలుస్తోంది. నిజానికి ఏదైనా పెద్ద ఇష్యూ జ‌రిగిన‌ప్పుడు.. దాదాపుగా అన్ని ప‌త్రిక‌లు ఒకేలాంటి లైన్ తీసుకుంటాయి. కానీ.. అందుకు భిన్న‌మైన ప‌రిస్థితి ఎందుకంటే.. మంత్రివ‌ర్గ స‌మావేశం నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన మంత్రులు మొద‌టిసారి నోట్లో నుంచి ఒక్క మాట అంటే ఒక్క మాట చెప్పేందుకు సైతం ఇష్ట‌ప‌డ‌లేదట‌. ముంద‌స్తు గురించి మాట్లాడితే.. అదొక్క‌టి త‌ప్ప ఏదైనా అడ‌గండంటూ క‌రాఖండిగా తేల్చేయ‌టంతో ఎవ‌రికి వారు.. వారికున్న ఆలోచ‌నా శ‌క్తి మేర‌కు వార్త‌లు రాయ‌టం.. అదే ఈ రోజు ఉద‌యం పేప‌ర్లో రావ‌టం జ‌రిగిన‌ట్లుగా తెలుస్తోంది.

చివ‌ర‌కు.. ముంద‌స్తుకు కేసీఆర్ సిద్ధ‌మ‌వుతున్నార‌న్న వార్త సంచ‌ల‌నంగా మారుతోంది. ఏది ఏమైనా.. కేసీఆర్ పుణ్య‌మా అని ఎప్పుడూ ఎదురుకాని చిత్ర‌మైన ప‌రిస్థితిని పొలిటిక‌ల్ రిపోర్ట‌ర్లు ఎదుర్కొంటున్నారు. సీఎం పుణ్య‌మా అని ప‌త్రికాఫీసుల్లో పంచాయితీల మోత మోగుతుంద‌న్న‌ట్లుగా తెలుస్తోంది. ఏం కాక‌ముందే ఇలా ఉంటే.. రానున్న రోజుల్లో ప‌రిస్థితి ఎంత ఇబ్బందిక‌రంగా ఉంటుంద‌న్న మాట ప‌లువురి పొలిటిక‌ల్ రిపోర్ట‌ర్ల నోట వినిపిస్తోంది.