Begin typing your search above and press return to search.
టీఆర్ ఎస్ లో ఎందుకింత వణుకు?
By: Tupaki Desk | 29 Oct 2015 4:16 PM GMTచిన్నపామునైనా పెద్ద కర్రతో కొట్టాలని తెలంగాణలో అధికార టీఆర్ ఎస్ పార్టీ భావిస్తోంది. వరంగల్ పార్లమెంటు ఉప ఎన్నికకు ఆ పార్టీ సిద్ధమవుతున్న తీరును చూస్తుంటే ఇది నిజమేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఉప ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలుస్తామని టీఆర్ ఎస్ పార్టీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ తాజాగా సీఎం కేసీఆర్ తో జరిగిన సమావేశంలో సీన్ మారినట్టుగా కనిపిస్తోంది.
టీఆర్ ఎస్ పార్టీ ముఖ్యనేతలతో పాటు వరంగల్ జిల్లా నేతలతో టీఆర్ ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ టీఆర్ ఎస్ భవన్ లో భేటీ అయ్యారు. ఉప ఎన్నికల అభ్యర్థి ఎంపికపై కసరత్తు చేశారు.ఈ సమావేశం వివరాలను ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి మీడియాకు వివరించారు. అభ్యర్థి పై తుది నిర్ణయం ఇంకా జరగలేదని త్వరలోనే సీఎం కేసీఆర్ స్వయంగా అభ్యర్థిని ప్రకటిస్తారని చెప్పారు. నవంబర్ 17- 18 తేదీల్లో సీఎం ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని తెలిపారు.
ఇదిలా ఉండగా లోక్ సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ లలో ఏడుగురు మంత్రులను ఇంచార్జ్ లుగా నియమించారు.
ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లకు ఇంచార్జులు వీరే:
ఈస్ట్ వరంగల్ – హరీశ్ రావు
వెస్ట్ వరంగల్ – కేటీఆర్
పరకాల – ఈటల రాజేందర్
భూపాలపల్లి – పోచారం శ్రీనివాసరెడ్డి
పాలకుర్తి – జగదీశ్ రెడ్డి
వర్ధన్నపేట్ – జోగురామన్న
స్టేషన్ ఘన్ పూర్ – ఇంద్రకరణ్ రెడ్డి. వీరందరినీ సీనియర్ ఎంపీ వినోద్ కుమార్ సమన్వయం చేయనున్నారు.