Begin typing your search above and press return to search.
2019 ఎన్నికల గురించి కేసీఆర్ మాట విన్నారా?
By: Tupaki Desk | 15 Jun 2016 1:33 PM GMTకాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి - దేవరకొండ - మిర్యాలగూడ ఎమ్మెల్యేలు రమావత్ రవీంద్రకుమార్ - భాస్కర్ రావు - మాజీ ఎంపీ వివేక్ - మాజీ మంత్రి వినోద్ - కరీంనగర్ జిల్లా కోరుట్ల కాంగ్రెస్ పార్టీ ఇన్ ఛార్జ్ జువ్వాడ నర్సింగరావు కారెక్కేశారు. వీరందరికీ టీఆర్ ఎస్ అధినేత - సీఎం కేసీఆర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
తెలంగాణ భవన్ లో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణకు రక్షణ కవచం టీఆర్ ఎస్ మాత్రమేనని ఉద్ఘాటించారు. రాజకీయ సుస్థిరత కోసం పార్టీలకతీతంగా నేతలు తమ వెంట వస్తున్నారని, తెలంగాణకు రక్షణ కవచం టీఆర్ ఎస్ పార్టీ అని ప్రజలు నమ్ముతున్నారని చెప్పారు. అందుకే ఏ ఎన్నికలు వచ్చినా టీఆర్ ఎస్ ను ప్రజలు గెలిపిస్తున్నారని చెప్పారు. చరిత్రలో ఏవరూ ఊహించని పనులు తెలంగాణలో జరుగుతున్నాయని తెలిపారు. రాజకీయ - ఆర్థిక సుస్థిరత్వాన్ని సాధించి ఆకుపచ్చ తెలంగాణను తయారు చేయడమే లక్ష్యమని స్పష్టం చేశారు. సమైక్యవాదుల కుట్రలకు తెలంగాణ బలికావొద్దని టీఆర్ ఎస్ కు తెలంగాణ ప్రజలే బాసులని చెప్పారు.
‘రాష్ట్రం ఏర్పడవద్దు.. ఏర్పడితే బతకనీయవద్దు అని కుట్రలు జరిగాయి. రాష్ట్రం వచ్చిన తర్వాత టీఆర్ ఎస్ ఒంటరిగా పోటీ చేసి 63 స్థానాలు గెలుపొందింది. మళ్లీ ఆంధ్రా - తెలంగాణను ఏకం చేస్తామని చంద్రబాబు మాట్లాడిండు. టీఆర్ ఎస్ ప్రభుత్వాన్ని దించేసి.. రాష్ట్రపతి పాలన తెచ్చేందుకు కుట్రలు చేశారు. ఆ సమయంలో మజ్లిస్ పార్టీ టీఆర్ ఎస్ కు మద్దతిచ్చింది. దేశం ముందు తెలంగాణ గెలిచి నిలవాలి. తెలంగాణకు రాజకీయ సుస్థిరత చాలా అవసరం అని కేసీఆర్ చెప్పారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పై కేసీఆర్ ఫైర్ అయ్యారు. ‘టీఆర్ ఎస్ ఎమ్మెల్యేలను వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ లో కలుపుకున్నప్పుడు జానారెడ్డి ఏం చేసిండు? విజయశాంతి - అరవిందరెడ్డిని కాంగ్రెస్ లో చేర్చుకోవడం ఏం నీతి? మీరు చేస్తే సంసారం.. తాము చేస్తే వ్యభిచారమా అని ప్రశ్నించారు. అచ్చంపేటలో కాంగ్రెస్ - టీడీపీ కలిసి పోటీ చేయడం ఏం నీతి? మీకో నీతి.. మాకో నీతా అని ప్రశ్నించారు. టీఆర్ ఎస్ ప్రభుత్వం పడిపోతదని మల్లు భట్టి విక్రమార్క మాట్లాడిండు. రాష్ట్రంలో సుపరిపాలన జరగడం కాంగ్రెస్ నేతలకు ఇష్టం లేదు. మాపై విమర్శలు చేసినపుడు ఏమైపోయారు?’ అంటూ ప్రశ్నించారు.
మిత్రులందరి కలయిక వల్ల అద్భుతమైన రాజకీయ సుస్థిరత్వం ఏర్పడిందని కేసీఆర్ చెప్పారు. బ్రహ్మాండంగా కోటి ఎకరాలకు నీరు పారించుకుందామని, అద్భుతంగా తెలంగాణను తయారు చేసుకుందామని ప్రకటించారు. 2019 లోపే ప్రాజెక్టులున్నీ పూర్తి చేస్తామని 2019లో టీఆర్ ఎస్ దే అధికారమని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు.