Begin typing your search above and press return to search.
హుజూర్ నగర్ రిపోర్ట్ బయటపెట్టిన కేసీఆర్
By: Tupaki Desk | 24 Sep 2019 5:59 AM GMTపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో ఖాళీ అయిన హుజూర్ నగర్ లో ఇప్పుడు ఉప ఎన్నికలకు వేళయ్యింది. అక్టోబర్ నెలాఖరులో నిర్వహించనున్న ఈ ఎన్నికకు గులాబీ బాస్ రంగం సిద్ధం చేస్తున్నారు. టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న శానంపూడి సైదిరెడ్డికి కేసీఆర్ బీఫాం అందజేశారు.
హుజూర్ నగర్ లో కాంగ్రెస్ ను ఓడించి పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి షాకివ్వాలని పట్టుదలతో ఉన్న కేసీఆర్ అందుకు అనుగుణంగా అక్కడ గెలుపు అవకాశాలపై కొద్దిరోజుల క్రితమే సర్వే చేయించినట్టు తెలిసింది. ఆ సర్వేలో టీఆర్ ఎస్ విజయం సాధించే అవకాశాలు ఉన్నాయని రిపోర్ట్ వచ్చిందట.. అభ్యర్థిగా మొన్న ఎన్నికల్లో ఓడిన సైదిరెడ్డిపై సానుభూతి ఉందని.. ఆయనే సరైన అభ్యర్థి అని తేలిందట..
అందుకే ఈసీ ఎన్నికకు నోటిఫికేషన్ వెలువరించిన వెంటనే కేసీఆర్ చర్చలు లేకుండా మరో మాటకు తావు లేకుండా సైదిరెడ్డిని అభ్యర్థిగా ప్రకటించారట..
కేసీఆర్ చేసిన సర్వేలో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచిన ఉత్తమ్ కుమార్ రెడ్డిపై తీవ్ర వ్యతిరేకత వచ్చినట్టు సమాచారం. ఏనాడు ఆయన నియోజకవర్గాన్ని పట్టించుకోలేదని చాలా మంది సర్వేలో అభిప్రాయపడినట్టు తెలిసిందట.. ఇక కేసీఆర్ ధైర్యానికి మరో బలమైన కారణం కూడా ఉంది. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో హుజూర్ నగర్ నియోజకవర్గంలో మెజారిటీ గ్రామ పంచాయతీల్లో టీఆర్ఎస్ అభ్యర్థులే విజయం సాధించారు. దీంతో ఆ ఓట్లన్నీ గులాబీ పార్టీకే పడుతాయని కేసీఆర్ బలంగా విశ్వసిస్తున్నారు. అందుకోసమే హుజూర్ నగర్ విషయంలో కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీ నమ్మకంతో బలంగా ముందుకెళుతున్నట్టు అర్థమవుతోంది.