Begin typing your search above and press return to search.
ఫాలో కేసీఆర్.. పార్టీ అలర్ట్!
By: Tupaki Desk | 8 Jan 2018 4:12 AM GMTదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు కేసీఆర్ ను రోల్ మోడల్ గా తీసుకోవాలని - తెలంగాణ ప్రభుత్వ పాలనను కేస్ స్టడీ చేయాలని వారం రోజుల కిందట పవన్ కల్యాణ్ చాలా ఘనంగా కితాబులు ఇచ్చారు. నిరంతరాయ వ్యవసాయ విద్యుత్తు సరఫరా గురించి ఆయన అంత ఘనంగా కీర్తించారు. ఆ సంగతి ఎలా ఉన్నప్పటికీ.. రాజకీయ ప్రణాళికలో మాత్రం.. ఇతర రాష్ట్రాల్లోని పార్టీలు - ప్రధానంగా ప్రాంతీయ పార్టీల ప్రభుత్వాలు కేసీఆర్ ను ఫాలో అవుతూ - ఆయనను చూసి అలర్ట్ అయ్యే వాతావరణం ఏర్పడుతోంది. ఇప్పుడు కేసీఆర్ పార్టీ నిర్మాణం మీద దృష్టి పెట్టి.. ఈ ఏడాదిలోనే ఎన్నికలు వచ్చేస్తాయనే సమాచారంతో... రెడీ అవుతున్నారనే వార్తలు రాగానే.. మిగిలిన రాష్ట్రాల్లోని - తెలుగు రాష్ట్రాల్లోని ఇతర పార్టీలు ... నిజమే కాబోలు ఎన్నికలు వచ్చేస్తున్నాయేమో అని రెడీ అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది.
గులాబీ పార్టీకి ఎంతగా ప్రజాదరణ ఉన్నా.. నాయకుల లెవెల్లో తెలుగుదేశం దాదాపు పూర్తిగా ఖాళీ అయి గులాబీ పంచకు చేరినా - కాంగ్రెస్ నుంచి కూడా వలసలు పుష్కలంగా అటువైపు వాటిల్లినా.. ఆ పార్టీ బూత్ స్థాయి వరకు బలంగా ఉన్నదనే అభిప్రాయం అధినేతలో కలగడం లేదు. పార్టీ బలంగా ఉన్నచోట చాలా బలంగా ఉన్నది గానీ.. బలహీనంగా ఉన్న చోట అసలు సంస్థాగతంగా తాము చేసిందేమీ లేదనే అభిప్రాయం కేసీఆర్ లో ఉన్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ నాలుగేళ్ల పాలన కాలంలో ఒక దశలో పార్టీ నిర్మాణాన్ని పర్యవేక్షించడానికి కేబినెట్ మంత్రి పదవి లేకుండా ఒక సీనియర్ నాయకుడిని పూర్తి స్థాయి కీలక బాధ్యతలతో అప్పగించాలని కూడా కేసీఆర్ ప్లాన్ చేశారు. అప్పట్లో కేటీఆర్ ను పార్టీ అద్యక్షుడిగా ప్రకటించి - కేబినెట్ మంత్రి పదవినుంచి తప్పిస్తారని.. పార్టీని బలోపేతం చేయడం కేటీఆర్ బాధ్యత.. ప్రభుత్వాన్ని నడిపించడం కేసీఆర్ బాధ్యత అన్నట్లుగా ముందుకు సాగుతారని కూడా కొంత కాలం ప్రచారం జరిగింది. అయితే కేటీఆర్ ను మంత్రి పదవినుంచి తప్పించడం జరగలేదు. దానికి తగ్గట్లుగా పార్టీ సంస్థాగత నిర్మాణమూ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగానే ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా కేసీఆర్ ఏప్రిల్ నుంచి పార్టీ పై పూర్తి శ్రద్ధ పెట్టి ఎన్నికలకు సిద్ధంచేయబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
కేసీఆర్ ను అనుసరిస్తూ మిగిలిన పార్టీలు కూడా ఎన్నికల సమరానికి సిద్ధం అయిపోయే పరిస్థితి కూడా కనిపిస్తోంది. మొత్తానికి పాలనలో ఇది చివరి సంవత్సరం అయినప్పటికీ.. ఎన్నికల భయాలు ముంచుకు వచ్చిన సంవత్సరంగా కనిపిస్తోంది.