Begin typing your search above and press return to search.
కేసీఆర్ ఫోకస్ అంతా గ్రేటర్ పైనేనా?
By: Tupaki Desk | 22 Nov 2015 7:53 AM GMTవరంగల్ ఉప ఎన్నికలో కీలక ఘట్టమైన పోలింగ్ పూర్తయింది. అనుకున్న విధంగానే వరంగల్ ఓటర్ల మనసుల్ని దోచుకోవటంలో తెలంగాణ అధికారపక్షం సక్సెస్ అయ్యిందన్న భావన గులాబీ దళంలో స్పష్టంగా కనిపిస్తుంది. మెజార్టీ విషయంలో పార్టీ అంచనాలకు కాస్త అటూఇటూగా ఉన్నా.. గెలుపు మాత్రం పక్కా అని తేలిపోవటంతో వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తాము వేసుకున్న వ్యూహం పక్కాగా వర్క్ వుట్ అయిన నేపథ్యంలో గులాబీ దళం ఇప్పుడు తమ శక్తి సామర్థ్యాల్ని గ్రేటర్ హైదరాబాద్ మీద పెట్టాలని నిర్ణయించారు.
గ్రేటర్ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టి గ్రేటర్ మీద పెట్టనున్నారన్న వాదన వినిపిస్తోంది. తెలంగాణ అధికారపక్షానికి పరీక్ష లాంటి గ్రేటర్ ఎన్నికల్ని విజయవంతంగా పూర్తి చేయాలని కేసీఆర్ భావిస్తున్నారు. గ్రేటర్ కోటపై గులాబీ జెండా రెపరెపలాడేలా చేయటం ద్వారా తెలంగాణలో అధికారం సంపూర్ణం అవుతుందన్న భావన ఉంది. అందుకే.. గ్రేటర్ ఎన్నికల్ని కేసీఆర్ సీరియస్ గా తీసుకున్నారు.
ఈ ఎన్నికల్లో కీలకమైన సెటిలర్ల మనసుల్ని దోచుకునేందుకు కేసీఆర్ పక్కా స్కెచ్ వేశారన్న మాట వినిపిస్తోంది. సెటిలర్లకు భరోసా కల్పించటంతో పాటు.. తమ నాయకత్వంలో వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేశామన్న ప్రచారంతో పాటు.. తమకు విధేయతగా ఉండటం అంటే.. తెలంగాణకు విధేయతగా ఉన్నట్లేనన్న భావన కలిగంచటం ద్వారా సెటిలర్లను తమవైపు తిప్పుకోవాలన్న ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. సీమాంధ్రులు.. సీమాంధ్ర పార్టీతో కాకుండా.. తెలంగాణ పార్టీతో మమేకం కావాల్సిన అవసరం ఉందన్న భావనను ఎన్నికల సందర్భంగా కలిగించే అవకాశం ఉందంటున్నారు. ఏది ఏమైనా.. గ్రేటర్ ఎన్నికల్ని చాలా సీరియస్ గా తీసుకున్న కేసీఆర్.. తాను అనుకున్న గమ్యానికి చేరుకోవాలని భావిస్తున్నారు. మరి.. కేసీఆర్ కల నెరవేరుతుందా? అన్నది కాలమే సమాధానం చెప్పాలి.