Begin typing your search above and press return to search.

టీఆర్ ఎస్ వ్యూహం... గ్రామం !

By:  Tupaki Desk   |   23 July 2018 5:30 PM GMT
టీఆర్ ఎస్ వ్యూహం... గ్రామం !
X
తెలంగాణలో ఎన్నికల కాక పు‌ట్టింది. ఓటర్లను ఆకట్టుకునేందుకు అధికార - ప్రతిపక్షాలు వ్యూహ రచనలో మునిగి తేలుతున్నాయి. అధికారంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితి ఒక్కో అస్త్రాన్ని వెలికి తీస్తోంది. ప్రతిపక్ష కాంగ్రెస్ - భారతీయ జనతా పార్టీలు ఓటర్లను ఆకట్టుకునేందుకు వివిధ రకాల పేర్లతో యాత్రలు చేస్తున్నాయి. ఎన్నికలు వచ్చేందుకు ఏడాది గడువు ఉండడంతో ఇప్పటి నుంచే అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయి. పొత్తులపై కూడా సమాలోచనలు జరుపుతున్నాయ్. కాంగ్రెస్ పార్టీతో కలసి పనిచేయాలని... కెసీఆర్ ఓటమే లక్ష్యంగా ముందుకు వెళ్లాలని తెలుగుదేశం పార్టీ భావిస్తోంది. భారతీయ జనతా పార్టీ మాత్రం ఒంటరిగానే బరిలో దిగే అవకాశాలు ఉన్నాయి.

అధికార పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తొంది. గ్రామాలే లక్ష్యంగా వ్యూహ రచన చేస్తోంది. రాష్ట్రంలో ప్రతి పంచాయితీకి ఒక కార్యదర్శిని నియమిస్తూ తాజాగా ఉత్తరువులు జారీ చేసింది. వారం లోగా నియామక ప్రక్రియ ప్రారంభించి రెండు నెలలలోపు పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించింది. ఈ కార్యదర్శలకు ప్రొబేషన్ కాలంలో నెలకు 15000 జీతం చెల్లిస్తారు. వీరి ప్రొబేషన్ కాలం మూడేళ్లు. ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా ఉద్యోగాల భర్తీ - ఎన్నికల ప్రచారం చేబట్టారు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు. కొత్తగా నియమితులైన కార్యదర్శులంతా ప్రభుత్వ ఉద్యోగులే అయిన ఎన్నికలలో తెలంగాణ రాష్ట్ర సమితి విజయానికి పాటు పడతారు. ఒక విధంగా గ్రామ కార్యదర్శులందరూ తెలంగాణ రాష్ట్ర సమితి కార్యదర్శులే - గ్రామీణ స్దాయిలో పార్టీని బలోపేతం చేయడంలో భాగంగానే ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు ఈ కార్యదర్శుల నియమకానికి శ్రీకారం చుట్టినట్లు కనబుతోంది.

గ్రామాలలో అధికార పార్టీ ఎలా ఉంది ప్రతిపక్షాల బలం ఎంత..... బలగం ఎంత అనేది ఈ కార్యదర్శులు అంచనా వేస్తారు. ప్రతినెల లేదూ పదిహేను రోజులకు ఒకసారి కెసీఆర్‌ కు నివేదికలు ఇస్తారని సమాచారం. ప్రభుత్వ సొమ్ముతో పార్టీ పని చేయించుకోవడం మబాగా తెలుసునని ప్రతిపక్ష పార్టీలు విమర్శిస్తున్నాయి.