తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి సెంటిమెంటు కార్డును తీశారు. బీజేపీ భయం ఉందో ఏమో తెలియదు కానీ, మళ్లీ తెలంగాణ సెంటిమెంటును రాజేసే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే ఆయన మన నేల, మన రాష్ట్రం అంటూ .. పాత బాగానే ఊదడం ప్రారంభించారు. ప్రధాని మోడీ నిర్వాకంతో తెలంగాణకు 3 లక్షల కోట్లు కోల్పోయిందని చెప్పుకొచ్చారు. రాష్ట్రానికి బీజేపీ నేతలు ఏమీ చేయరని, చేసేవారు ఉంటే.. వారిని అడ్డుకుంటారని వ్యాఖ్యానించారు.
కృష్ణాజలాల్లో కేంద్రం రాష్ట్ర వాటా తేల్చడంలేదని కేసీఆర్ మండిపడ్డారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తిచేయాల్సి ఉందన్నారు. తెలంగాణ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. జాతీయ రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషిద్దామని మరోసారి కేసీఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు. మహబూబ్‌నగర్ ఎంపీగా ఉన్నప్పుడే తెలంగాణ సాధించుకున్నా మని, అదే స్ఫూర్తితో జాతీయ రాజకీయాల్లో ముందుకెళ్తున్నామని చెప్పారు.
ఏపీపై విమర్శలు..
కేసీఆర్ సెంటిమెంటును ప్రయోగించారు. సమైక్య రాష్ట్రం పేరును మరోసారి వాడుకున్నారు. అప్పట్లో ప్రభుత్వాన్ని నడిపినవారు.. తెలంగాణకు అన్యాయం చేశారని చెప్పుకొచ్చారు. `వలసలతో వలవలపించేను పాలమూరు` అనే పాట ఉండేదన్నారు. కానీ, ఇప్పుడు పాలమూరు అంటే పచ్చబడ్డ జిల్లాగా మారిందని చెప్పుకొచ్చారు.
పోరాటాలు చేసి సాధించుకున్న తెలంగాణలో అద్భుతమైన పథకాలు అమలు చేస్తున్నామన్నారు. సంక్షేమంలో తెలంగాణకు సాటి ఎవరూ లేరంటూ.. పరోక్షంగా ఏపీపై విమర్శలు గుప్పించారు. కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దుల్లోని ప్రజలు తెలంగాణలో కలపాలని కోరుతున్నారని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.