Begin typing your search above and press return to search.
మోడీ సర్.. నేను రాజీనామాకు రెడీ: కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
By: Tupaki Desk | 13 Feb 2023 11:26 AM GMTతెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. అసెంబ్లీ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ''మోడీ సర్.. ఇదే చెప్తున్న.. నేను చేసిన వ్యాఖ్యలు.. చెప్పిన లెక్కలు తప్పని నిరూపించే సాహసం చేయగలరా? నిరూపించండి.. ముఖ్యమంత్రిగా తక్షణం రాజీనామా చేస్తా'' అని కేసీఆర్ సంచలన కామెంట్లు చేశారు. దీంతో అసెంబ్లీ ఒక్కసారిగా వేడెక్కింది. తాను చెప్పిన లెక్కలన్నీ వాస్తవాలు.. ఒక్క అబద్ధం ఉన్నా రాజీనామా చేస్తానని కేసీఆర్ తెలిపారు. తన మాటకు కట్టుబడి ఉంటానని, అభివృద్ధిపై మాట్లాడే హక్కు మోడీకి లేదన్నారు.
కాంగ్రెస్ హయాంలో లైసెన్స్ రాజ్.. మోడీ హయాంలో సైలెన్స్ రాజ్ అని వ్యాఖ్యానించారు. రూ.20 లక్షలు కోట్లు ఎంఐఎంఈలకు ఇచ్చామన్నారని.. ఎవరికి ఇచ్చారు? అని కేసీఆర్ ప్రశ్నించారు. ఎన్డీఏ అంటే నో డాటా అవైలబుల్ అని కాంగ్రెస్ నేత చిదంబరం అన్నారని కేసీఆర్ గుర్తు చేశారు. కేంద్ర ఆర్థిక మంత్రి మోడీ ఫోటో కోసం రేషన్ డీలర్‌తో కొట్లాడతారా? ఏం సాధించారని మోడీ ఫోటో పెట్టుకోవాలని కేసీఆర్ అసెంబ్లీలో నిలదీశారు.
దేశంలో మోడీ తెచ్చిన ఏ పాలసీ అయినా సక్సెస్ అయ్యిందా?, నోట్ల రద్దు సక్సెస్ అయ్యిందా?, ఇప్పుడు మనీ సర్క్యూలేషన్ పెరిగిందని, కేంద్రం దగ్గర దేనికీ లెక్కలుండవని, ఎన్‌పీఏల పేరుతో లక్షల కోట్లు మాఫీ చేశారని కేసీఆర్ మండిడ్డారు.
మోడీపై కేసీఆర్ కామెంట్లు ఇవీ..
+ మోడీ సీఎంగా ఉన్న గుజరాత్‌లోని గోద్రాలో జరిగిన ఘటనపై బీబీసీ తీసిన డాక్యుమెంటరీని బ్యాన్ చేశారు. అదేకాకుండా ఏకంగా బీబీసీనే బ్యాన్ చేయాలని కోర్టులో పిటిషన్ వేశారు. బీబీసీ అంటే జీ న్యూసా ఈడీ దాడులు చేయగానే బంద్ చేయడానికి, బీబీసీ... నీ ఈడీ, బోడీలకి భయపడుతుందా?
+ ఈ అధికారం ఎన్ని రోజులు ఉంటుంది? 2024 తర్వాత అంతా కుప్పే మిగులుతుంది.
+ గతంలో మాజీ ప్రధాని ఇందిరను దుర్గామాత అంటూ వాజ్ పేయీ పొగిడారు. ఇందిర జీవితాన్ని ఓ కోర్టు తీర్పు మలుపు తిప్పింది. ఇందిరను కూడా ప్రజలు ఇంటికి పంపారు. నీ గతి కూడా అంతే(మోడీ).
+ పనితీరు బాగా లేకున్నా మోడీని పొగుడుతున్నారు. ఎల్ఐసీని అమ్మాల్సిన అవసరం ఎందుకు వచ్చింది?
+ నష్టం వస్తే సమాజం నెత్తిన.. లాభం వస్తే ప్రైవేట్‌కు అప్పగిస్తున్నారు.
+ ఎయిర్ ఇండియాను మళ్లీ టాటాలకు అప్పగించారు. మోడీ హయాంలో ఏ రంగంలోనైనా వృద్ధి జరిగిందా?
+ కాంగ్రెస్ హయాంలో వార్షిక వృద్ధి రేటు 6.8. కానీ మోడీ వచ్చాక మన వృద్ధి రేటు 5.8కి పడిపోయింది.
+ యూపీఏ హయాంలో వృద్ధిరేటు 24 శాతం ఎక్కువ అని, కాంగ్రెస్ పాలనలో తలసరి ఆదాయం వృద్ధిరేటు 12.7 ఉండగా, మోడీ పాలనలో తలసరి ఆదాయం వృద్ధిరేటు 7.1 ఉంది. మోడీ పాలనలో సగానికి సగం పడిపోయింది.
+ ప్రధాని మోడీకి ఓట్లు కావాలంటే బియ్యం ఫ్రీ అంటారు.
+ మేకిన్ ఇండియా జోకింగ్ ఇండియాగా మార్చారు.
+ వందే భారత్ రైళ్లు గెదెలను గుద్దుకుని ఆగిపోతున్నాయి. ఇదీ.. మీ మేకిన్ ఇండియా!
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.