Begin typing your search above and press return to search.
హోడీ మోడీ హోరులో ఎవరికీ పట్టని సారు వార్నింగ్స్
By: Tupaki Desk | 23 Sep 2019 11:08 AM GMTయావత్ దేశమేమో కానీ.. దేశంలోని అన్ని ఛానళ్లు మాత్రం హోస్టన్ స్టేడియంలో మాదిరి హోడీ.. మోడీ అని జపించిన వైనం తెలిసిందే. దీనికి తెలుగు మీడియా సైతం మినహాయింపు కాదు. ఎన్నో అంశాలు ఉన్నా.. వాటిని పట్టించుకోకుండా మోడీ సభకు ఇచ్చిన ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. ఈ కారణంతోనే ఆదివారం తెలంగాణ అసెంబ్లీలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రసంగం పెద్దగా హైలెట్ కాలేదు. దాదాపు రెండున్నర గంటల పాటు సాగిన ఆయన ప్రసంగంలో చాలానే సంచలన వ్యాఖ్యలు ఉన్నాయి.
దేశమే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా మోడీ సమ్మోహనంలో చిక్కుకున్న వేళ.. అందుకు భిన్నంగా మోడీ మాటల్ని తీవ్రంగా తప్పు పట్టి.. తానెప్పుడూ మిగిలిన వారితో పోలిస్తే ఇస్పెషల్ అన్నట్లు వ్యవహరించారు. అంతేకాదు.. కేంద్రం మీద తనకున్న కోపాన్ని దాచుకునేందుకు అస్సలు ప్రయత్నించలేదు. రాష్ట్రానికి కేంద్రం ఏమీ చేయలేదని కరాఖండిగా తేల్చేయటమే కాదు.. అసలు రాష్ట్రానికి కేంద్రం ఏమిచ్చిందంటూ? సూటి ప్రశ్నను వేశారు.
ప్రధాని మోడీ మొదలు ప్రతిపక్షాలు.. రెవెన్యూ ఉద్యోగులతో సహా అందరిపైనా సీరియస్ అయి విరుచుకుపడ్డారు. అయితే.. ఈ విషయాలేవీ హోడీ.. మోడీ హడావుడిలో పెద్దగా ఫోకస్ కాలేదు. ఇంతకీ.. నిన్నటి అసెంబ్లీ ప్రసంగంలో కేసీఆర్ హైలెట్ గా మాట్లాడిన కొన్ని వ్యాఖ్యల్ని కచ్చితంగా చూడాల్సిందే.
% కుక్క తోకను ఊపుతుంది కానీ తోక కుక్కను ఊపదు. చట్టాల్ని రూపొందించేది ఉద్యోగులు కాదు. ఉద్యోగులు ప్రభుత్వాన్ని డిక్టేట్ చేయలేరు. ఉద్యోగులు పారదర్శకంగా పని చేయకపోతే కఠిన చర్యలు ఉంటాయి. నలుగురైదుగురు ఉద్యోగులకు.. వాళ్లకు వీళ్లకు ప్రభుత్వం భయపడదు.
% కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం చేసిందేమీ లేదు. తెలంగాణకు ఏమీ చేయకపోగా.. అవమానిస్తోంది. తల్లిని చంపి బిడ్డను బతికించారంటూ ప్రధాని నరేంద్ర మోడీ అంటున్నారు. తెలంగాణ ఏర్పాటును బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా డార్క్ డేగా అభివర్ణించారు. మీ వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలి. 60 ఏల్లు పోరాటం చేసి రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం. ఎవరూ దానంగా ఇవ్వలేదు.
% ఇప్పటికే అమలు చేస్తున్న పథకాలు కాకుండా మరో రెండు.. మూడు కొత్త పథకాల ఆలోచనలు ఉన్నాయి. వాటిని అమలు చేస్తే తెలంగాణలో కాంగ్రెస్ భవిష్యత్తు ఖతమవుతుంది.
% ఎన్నికలకు ముందు తాయిలాలు ప్రకటించే ప్రభుత్వం కాదు మాది. ఆంధ్రప్రదేశ్ లో పసుపు-కుంకుమ లాంటివి ప్రకటిస్తే ప్రజలు ఎలా స్పందించారో తెలిసిందే.
% ఎవరికీ భయపడం. మార్చాల్సిన చట్టాల్ని మారుస్తాం. కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకురానున్నాం. దాన్ని చూసి దేశం ఆశ్చర్యపోతుంది. మేం రూపొందిస్తున్న ధరణి వెబ్ సైట్ వచ్చాక రిజిస్ట్రేషన్ అయిన గంటల్లోనే పట్టా వచ్చేస్తుంది. వీఆర్వోలను తీసేస్తామని ప్రభుత్వం చెప్పలేదు. ఒకవేళ వీఆర్వోలు తొలగించాల్సి వస్తే తొలగిస్తాం. కౌలుదారులను టీఆర్ఎస్ ప్రభుత్వం గుర్తించదలుచుకోలేదు.
% ఎమ్మెల్యేల విలీనం తప్పు ఎలా అవుతుంది? ఉపరాష్ట్రపతి సమక్షంలో నలుగురు టీడీపీ రాజ్యసభ సభ్యులు బీజేపీలో విలీనం కావటంతో పాటు అదే రోజు ప్రధానితో భేటీ అయ్యారు. గోవాలో పది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీలో విలీనం కాగా.. ఇటీవల రాజస్థాన్ లో బీఎస్పీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేల్ని కాంగ్రెస్ విలీనం చేసుకోలేదా? అలాగే ఇక్కడ కూడా 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో విలీనమయ్యారు
% అప్పులు తీసుకురావటం తప్పు కాదు. అవసరమైతే ఇంకా అప్పుల్ని తెస్తాం. ఎన్ని ఇబ్బందులు వచ్చినా సాగునీటి ప్రాజెక్టులను ఆపేది లేదు. సంక్షేమానికి ప్రాధాన్యాన్ని తగ్గించం.