Begin typing your search above and press return to search.

భ‌లే అడిగావ్ కేసీఆర్!

By:  Tupaki Desk   |   29 Nov 2018 4:28 PM GMT
భ‌లే అడిగావ్ కేసీఆర్!
X
గొప్ప‌లు చెప్ప‌వ‌య్యా బాబూ అని చంద్ర‌బాబును క‌నుక అడిగార‌నుకోండి... ఇక చాలు ఆప‌వ‌య్యా బాబూ అని బ‌తిమ‌లాడినా ఆయ‌న ఆప‌రు. ద‌టీజ్ చంద్ర‌బాబు. చివ‌ర‌కు ఆయ‌నను కేసీఆర్ త‌న మాట‌ల‌తో కంట్రోల్ చేశారు. ప‌దేప‌దే హైద‌రాబాదును నేనే క‌ట్టాను అని చెప్పుకునే చంద్ర‌బాబు మాట‌ల‌తో విసిగిపోయిన కేసీఆర్ *నువ్వు హైద‌రాబాదు క‌డితే కులీకుతుబ్‌ షా ఏం క‌ట్టిండు? ఆత్మ‌హ‌త్య చేసుకుని స‌చ్చిండా?* అని వ్యంగాస్త్రం సంధించారు కేసీఆర్‌.

దీనికి చంద్ర‌బాబు కూడా స‌మాధానం చెప్పారు. కేసీఆర్ దెబ్బ‌కు నేను హైద‌రాబాదు క‌ట్ట‌లేదు బాబోయ్ అని త‌న నోటితోనే క్లారిటీ ఇచ్చేశారు. అంత‌టితో ఊరుకోకుండా నేనెపుడు అన్నాను. నేను అన‌లేదు. కేసీఆర్ ప్ర‌చారం చేశారంతే అని ఇత‌రుల మీద తోసేసే ప్ర‌య‌త్నం చేశారు చంద్ర‌బాబు.

తాజాగా మ‌రోసారి హైద‌రాబాదు నిర్మాత అనే విష‌యంలో కేసీఆర్ బాబును ట్రోల్ చేస్తూ ఓ ఘాటైన ప్ర‌శ్న వేశారు. చంద్రబాబూ... ఓ మాట చెప్పు. హైదరాబాదునే క‌ట్టిన మొన‌గాడు నవ్వు. ప్ర‌పంచ ప‌టంలో హైద‌రాబాదును పెట్ట‌గ‌లిగిన నువ్వు హైద‌రాబాదులో క‌రెంటును ఎందుకు ఇవ్వ‌లేక‌పోయావు? అంత పెద్ద ఫీటును చేసిన నీకు క‌రెంటు ఇవ్వ‌డం క‌ష్ట‌మైందా? అని ప్ర‌శ్నించారు. బ‌హుశా ఈ ప్ర‌శ్న‌కు చంద్ర‌బాబు నుంచి స‌మాధానం రాక‌పోవ‌చ్చు.