Begin typing your search above and press return to search.

బీజేపీ అధికారంలోకి వొస్తే..వొచ్చేది పంగ‌నామాలే...!

By:  Tupaki Desk   |   22 Sep 2019 4:02 PM GMT
బీజేపీ అధికారంలోకి వొస్తే..వొచ్చేది పంగ‌నామాలే...!
X
తెలంగాణ‌లో బీజేపీ అధికారంలో వ‌స్తుంద‌ట‌.. అది అధికారంలోకి వ‌స్తే ఒచ్చేది ఒరిగేదేంది.. పంగ‌నామాలు త‌ప్పితే ఏమి ఒర‌గ‌ద‌ని తెలంగాణ సీఎం కేసీఆర్ ఆరోపించారు. కేసీఆర్ మీడియాలో మాట్లాడుతూ ఏం లేనోనికి ఏతులు ఎక్క‌వ‌ట‌.. గ‌ట్లుంది బీజేపీ నాయ‌కులు య‌వ్వారం.. రానున్న ఎన్నిక‌ల్లో బీజేపీ తెలంగాణ‌లో అధికారంలోకి వ‌స్తుంద‌ని ఆ పార్టీ నాయ‌కులు ఏతులు కొడుతుండ్లు.. వాళ్ళు అధికారంలోకి వొస్తే జ‌నాల‌కు ఏం ఒరుగుతుంది.. వాళ్ళు పెట్టే పంగ‌నామాలు త‌ప్ప అని ఎద్దేవా చేశారు. ఏదో పార్లమెంట్ ఎన్నిక‌ల్లో నాలుగు స్థానాలు గెలిచిండ్లు.. దీంతో ఏదో సాధిచ్చిన‌మ‌ని ఓ గొప్ప‌ల‌కు పోతుండ్లు.. అంతే కానీ ఆ పార్టీ గెలిచేది లేదు.. అధికారం చేసేది లేదు.. అని బీజేపీ నేత‌ల‌పై కేసీఆర్ వ్యంగాస్త్రాలు సంధించారు.

ఇటీవ‌ల బీజేపీ నాయ‌కులు తెలంగాణ‌లో బీజేపీ అధికారంలోకి వ‌స్తుంద‌ని జోరుగా ప్ర‌చారం చేస్తుండ్లు.. అదే విధంగా నిజ‌మాబాద్‌లో కేసీఆర్ కుమార్తే క‌విత ఓట‌మి చెందారు. దీంతో బీజేపీ నేతులు తెలంగాణ‌లో బీజేపీదే అధికారం అంటూ కామెంట్లు చేస్తున్నారు. బీజేపీ ఎంపీ ధ‌ర్మ‌పురి అర‌వింద్ కేసీఆర్ బ‌తికుండ‌గానే టీఆర్ ఎస్‌ ను ఆయన కండ్ల ముందే బొంద పెడుతామ‌ని వ్యాఖ్యానించారు. అంతేకాదు బీజేపీ నాయ‌కురాలును కొత్త గ‌వ‌ర్న‌ర్ గా నియ‌మించారు. దీంతో ఇక తెలంగాణ‌లో బీజేపీ అధికారంలోకి రావ‌డం త‌రువాయి అనే విధంగా బీజేపీ నేత‌లు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి స్పందించిన కేసీఆర్ బీజేపీ నేత‌ల‌పై ఘాటుగా స్పందించారు.

బీజేపీ తెలంగాణ‌లో అనుస‌రిస్తున్న వైఖ‌రీ స‌రిగా లేద‌ని - తెలంగాణ‌లో అభివృద్ధికి న‌యాపైసా ఇవ్వ‌లేద‌ని - కేవ‌లం ప‌నికి రాని వాగ్ధానాలు అని కేసీఆర్ అన్నారు. బీజేపీ తెలంగాణ‌లో అధికారంలోకి వ‌స్తే ఆరోగ్య శ్రీ పోయి ఆయుష్మాన్ భార‌త్ వ‌స్తుంద‌ని - రైతుబంధు పోయి కిసాన్ స‌మ్మాన్ వ‌స్తుంద‌ని - రైతు భీమా పోయి రైతు ద‌గా వ‌స్తుంద‌ని వ్యాఖ్యానించారు కేసీఆర్‌. నాందేడ్ ప్ర‌జలు తెలంగాణ‌లో మా ప్రాంతానికి క‌లుపుకోవాల‌ని కోరుతున్నార‌ని - బీజేపీ పాల‌న చ‌క్క‌గా ఉంటే అక్క‌డి ప్ర‌జ‌లు ఎందుకు ఇలా ఆందోళ‌న చేస్తార‌ని కేసీఆర్ దుయ్య‌బ‌ట్టారు. బీజేపీ పాల‌న క‌న్నా తెలంగాణ‌లోనే పాల‌న బాగుంద‌ని ఇక‌నైనా బీజేపీ నేతులు శుష్క వాగ్ధానాలు మాని శూన్య హ‌స్తాలు చాపుకుని కూర్చోవాల‌ని హితువు ప‌లికారు.