Begin typing your search above and press return to search.
పేపర్లో వార్తకు అంతలా స్పందించిన కేసీఆర్
By: Tupaki Desk | 29 Aug 2017 4:31 AM GMTరాజకీయం సంగతి పక్కన పెడితే.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు సంబంధించి కొన్ని అంశాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. కొన్ని విషయాల విషయంలో ఆయన అనూహ్యంగా స్పందిస్తుంటారు. పేపర్లో వార్తలు చూసి ఏం ఉందిలే అన్నట్లు కాకుండా ఆయన రియాక్ట్ అయ్యే తీరు కేసీఆర్ పై మరింత అభిమానాన్ని పెంచేలా చేస్తుంది. తాజాగా అలాంటి ఉదంతమే ఒకటి చోటు చేసుకుంది.
పుట్టినప్పటి నుంచి అనారోగ్యంతో బాధ పడుతున్న పదకొండు నెలల పిల్లాడి ఉదంతం గురించి తెలిసిన సీఎం కేసీఆర్ కదిలిపోయారు. గజ్వేల్ పట్టణానికి చెందిన దేవసాని శ్రీమాన్ అనే చిన్నారికి సంబంధించిన అనారోగ్య ఉదంతం గురించి మీడియా ద్వారా తెలిసిన కేసీఆర్ ఏ మాత్రం ఆలస్యం చేయలేదు. వెంటనే సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామరెడ్డికి ఫోన్ చేశారు.
చిన్నారి శ్రీమాన్ కు కాలేయానికి సంబంధించిన సమస్యతో బాధపడుతున్నాడని.. కాలేయాన్ని మార్చటమే అతడి సమస్యకు పరిష్కారంగా వైద్యులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అందుకు తగిన వైద్యం కోసం రూ.25 లక్షల మొత్తం అవసరమవుతుంది. పేద కుటుంబానికి చెందిన చిన్నారికి అంత మొత్తం ఎలా అందుతుందని ఆందోళన చెందిన వారికి సీఎం కేసీఆర్ స్పందించిన తీరుపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. చిన్నారి గురించి తెలిసిన వెంటనే అతనికి సాయం చేయాలని తల్లడిల్లిన కేసీఆర్ కలెక్టర్ కు ఫోన్ చేసి.. వైద్యానికి అవసరమైన రూ.25 లక్షల చెక్కు ఇవ్వాలని ఆదేశించారు. సీఎం సహాయనిధి నుంచి ఈ నిధుల్ని విడుదల చేశారు. ఒక చిన్నారి కోసం కేసీఆర్ తల్లడిల్లిన వైనం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.