Begin typing your search above and press return to search.

అప్ప‌ట్లో భేటీకి నో.. ఇప్పుడు ఏమంటే అది ఓకే!

By:  Tupaki Desk   |   31 Aug 2018 4:43 AM GMT
అప్ప‌ట్లో భేటీకి నో.. ఇప్పుడు ఏమంటే అది ఓకే!
X
కేసీఆర్ అంటే మామూలోడు కాద‌న్న విష‌యాన్ని మ‌రోసారి త‌న చేత‌ల‌తో నిరూపించారు. ఎంత‌కూ కొరుకుడు ప‌డ‌ని మోడీని సైతం క్రాక్ చేశార‌ని చెప్పాలి. ఒక‌ప్పుడు త‌న‌తో భేటీ కోసం ప్ర‌య‌త్నిస్తే అపాయింట్ మెంట్ ఇచ్చేందుకు సైతం ప్ర‌ధాని మోడీ ఇష్ట‌ప‌డ‌న‌ట్లుగా చెప్పేవారు. ప్ర‌ధాని అపాయింట్ మెంట్ కోసం తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ కిందా మీదా ప‌డేవార‌ని చెబుతారు.

ఇందుకు నిద‌ర్శ‌నంగా వారి మొద‌టి భేటీనే నిద‌ర్శ‌నంగా చెప్పాలి. చాలాసార్లు ప్ర‌య‌త్నించిన త‌ర్వాత భేటీకి టైం ఇచ్చారు. ఆ త‌ర్వాత కూడా వేరే కార్య‌క్ర‌మాలు ఉన్నాయ‌ని.. బిజీగా ఉన్నార‌ని క్యాన్సిల్ చేయ‌టాన్ని మ‌ర్చిపోకూడ‌దు. అంతేనా.. తాను మోడీని క‌లిసేందుకు ఢిల్లీకి వెళుతున్న‌ట్లు చెప్పి బ‌య‌లుదేరిన కేసీఆర్ కు.. తీరా ఢిల్లీ వెళ్లిన త‌ర్వాత మోడీ హ్యాండ్ ఇచ్చార‌న్న విష‌యాన్ని ప‌లువురు గుర్తు చేసుకుంటున్నారు.

ఎక్క‌డైతే త‌న‌కు తిర‌స్కారం ఎదురైందో.. అక్క‌డే తాను అనుకున్న‌ది సాధించిన కేసీఆర్ మొన‌గాడు భ‌య్ అని కొంద‌రు.. ఎవ‌రిని ద‌గ్గ‌ర‌కు రానివ్వ‌ని మోడీ సైతం.. ఏం మాట్లాడారో.. ఏం చెప్పారో కానీ.. తాను కోరుకున్న ప‌నిని కోరుకున్న‌ట్లుగా పూర్తి చేయించుకోవ‌టం ద్వారా.. త‌న బుట్ట‌లో మోడీ ప‌డేట‌ట్లు చేసుకోవ‌టంలో కేసీఆర్ స‌క్సెస్ అయిన‌ట్లుగా ప‌లువురు వ్యాఖ్యానించుకోవ‌టం క‌నిపిస్తోంది.

ఇంత‌కూ జోన‌ల్ విష‌యంలో కేసీఆర్ చెప్పిన‌ట్లే మోడీ ఎందుకు పాలో అయిన‌ట్లు? దేశంలో మ‌రెక్క‌డా లేని విధంగా 95 శాతం స్థానిక‌త‌కు ఎందుకు ఓకే చేసిన‌ట్లు? అన్న ప్ర‌శ్న‌ల‌కు ఆస‌క్తిక‌ర స‌మాధానం వినిపిస్తోంది. జోన‌ల్ వ్య‌వ‌స్థ మీద తాను తీసుకొచ్చే కొత్త విధానం తెలంగాణ రాజ‌కీయాల్ని ప్ర‌భావితం చేయ‌ట‌మే కాదు. ఎన్నిక‌ల్లో ఘ‌న విజ‌యం సాధించేందుకు తోడ్ప‌డుతుంద‌ని.. అది భ‌విష్య‌త్తులో మోడీకి ప్ర‌యోజ‌న‌క‌రంగా మారుతుంద‌న్న కేసీఆర్ మాట‌కు మోడీ మాష్టారు సైతం ఓకే అన్న‌ట్లుగా చెబుతున్నారు. ఏమైనా.. దేశంలో మ‌రెక్కడా లేని రీతిలో స్థానిక‌త అంశాన్ని ఈ స్థాయిలో మోడీ చేత చెప్పి చేయించుకోవ‌టం కేసీఆర్ ఎంత‌లా మంత్రాంగం చేస్తార‌న్న దానికి నిద‌ర్శ‌నంగా చెబుతున‌నారు. అంతేకాదు.. ఢిల్లీలో కూర్చొని మ‌రీ ఫైలు మీద సంత‌కం పెట్టించుకోవ‌టం కేసీఆర్‌కే చెల్లింద‌ని చెప్పాలి. ఎన్డీయేత‌ర ముఖ్య‌మంత్రుల్లో ఇంత‌లా మోడీని ప్ర‌భావితం చేసి ముఖ్య‌మంత్రుల్లో కేసీఆర్ మాత్ర‌మే క‌నిపిస్తారు. ఏమైనా స‌రే.. మోడీనే మ‌నోడు బుట్ట‌లో ఏసేశాడ్రా.. కేసీఆర్ మ‌గాడ్రా బుజ్జి అన్న మాట‌లు కొంద‌రి నోటి నుంచి వినిపించ‌టం గ‌మ‌నార్హం.