Begin typing your search above and press return to search.
దిల్లున్న ముఖ్యమంత్రి !
By: Tupaki Desk | 9 Aug 2015 5:44 AM GMTదశాబ్దాల పాటు కొనసాగుతున్న విధానాల్ని ఒక్క కలం పోటుగా కొట్టిపారేయాలంటే ఎంతో దమ్ము..ధైర్యం అవసరం. వ్యవస్థలో ఉన్న విధానాల్ని సమూలంగా మార్చేందుకు.. బలమైన నేతలనేతృత్వంలోని ప్రభుత్వాలు సైతం మనకెందుకులే అని ఊరుకుంటాయి. కానీ.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అందుకు భిన్నం. తాను చేయాలనుకున్న దాన్ని చేసేస్తారు. అందుకోసం ఎంత ముందుకైనా వెళతారు.
ఎవరో ఏదో అనుకుంటారని అస్సలు అనుకోరు కదా.. పాత ఒక రోత.. కొత్త ఒక వింతగా తాను అనుకున్న దాన్ని మార్చే సత్తా ఆయన సొంతం. ఆస్తులుకొనుగోలు సమయంలో రిజిష్ట్రార్ ఆఫీసులకు వెళ్లిన సమయంలో అక్కడి రిజిష్టార్ ఎత్తైన గద్దె (వేదిక) మీద కుర్చీ వేసుకొని కూర్చోవటం.. దాని ముందు.. కోట్లాది రూపాయిలు ఆస్తులు కొనుగోలు చేసుకునే వారు నిలబడటం లాంటివి చూసినప్పుడు.. రిజిష్ట్రార్ అంత ఎత్తైన వేదిక మీద ఎందుకు కూర్చున్నారన్నది ఎవరికి అర్థం కాదు.
ఒకవేళ డౌట్ వచ్చి అడిగితే.. సమాధానం చెప్పటం తర్వాత.. వింతగా చూడటం ఖాయం. మరి.. ఏమనుకున్నారో ఏమో కానీ.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టిలో ఇది పడినట్లుంది. తాజాగా ఆయన ఓ నిర్ణయాన్ని తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని రిజిష్ట్రార్ కార్యాలయాల్లో పెద్ద వేదిక మీద కుర్చీ వేసుకొని ఉండే విదానాన్ని తీసేయాలని.. ప్రజలతో సమానంగా నేల మీద కుర్చీలు వేసుకొని కూర్చోవాలని నిర్ణయించారు.
ఇందుకు.. ఆగస్టు 15 ముహుర్తం పెట్టారు. ఆ రోజు నుంచి సబ్ రిజిష్ట్రార్ కార్యాయాల రూపం మారిపోనుంది. తెలంగాణ రాష్ట్రంలోని 141 సబ్ రిజిష్ట్రార్ కార్యాలయాల్లోనూ ప్రజలతో సమానంగా రిజిష్ట్రార్లు కూర్చొవాల్సి ఉంటుంది. దీనికి తెలంగాణ సర్కారు వినిపిస్తున్న వాదన ఏమిటంటే.. సబ్ రిజిష్ట్రార్ గద్దె మీద కూర్చొని ఉండటం కారణంగా.. ప్రజలు చొరవగా అక్కడికి వెళ్లలేకపోతున్నారని.. దీంతో మధ్యవర్తుల హవా పెరిగి.. అవినీతి భారీగా సాగుతుందని చెబుతున్నారు. ఏమైనా.. వ్యవస్థలోని రూపురేఖల్ని మార్చాలంటే కాస్త దిల్లుండాలి. అది కేసీఆర్ సర్కారులో కాస్త ఎక్కువే.