Begin typing your search above and press return to search.
తెలంగాణ కొత్త సచివాలయం డిజైన్ మార్చిన కేసీఆర్
By: Tupaki Desk | 20 Dec 2020 12:34 PM GMTఅక్కడ మోడీ కొత్త పార్లమెంట్ వైపు అడుగులు వేస్తుంటే.. అంతకంటే ముందే తెలంగాణ సీఎం కేసీఆర్ కొత్త సచివాలయం నిర్మాణానికి పూనుకున్నారు. ఎప్పుడో డిజైన్ ఖరారు చేసి ఇప్పటికే పనులు కూడా మొదలుపెట్టారు.
గతంలోనే తుది డిజైన్ ను ఖరారు చేసినా సీఎం కేసీఆర్ తాజాగా పలు మార్పులు సూచించారని తెలిసింది. నిర్మాణ డిజైన్ లో అంతర్గతంగా.. వెలుపల పలు మార్పులు చేసింది తెలంగాణ ప్రభుత్వం. కొత్తగా ప్రభుత్వం ఆమోదించిన డిజైన్ లో భవనం ముందు స్థలంలో హెలిప్యాడ్, రెండు వైపులా లాన్లు, వాహనాల పార్కింగ్ స్థలంలో చిన్నపాటి మార్పులు చేశారు.
మరోవైపు సచివాలయం కూల్చివేత, నిర్మాణం విషయంలో హైకోర్టు దాఖలైన కేసులు తొలిగిపోయాయి. కొత్త భవన నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. 500 కోట్ల రూపాయలతో కొత్త సచివాలయంను నిర్మించబోతున్నారు.
వచ్చే ఏడాది అక్టోబర్ నాటికి కొత్త సచివాలయం నిర్మాణాన్ని పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. పనులు ప్రారంభమైన నేపథ్యంలో భవన నిర్మాణం, ఖాళీ స్థలంలో చిన్నపాటి మార్పులు చేస్తూ నిర్మాణ సంస్థకు ప్రభుత్వం తాజాగా ఆదేశాలు జారీ చేసింది.