Begin typing your search above and press return to search.
కాంగ్రెస్ - బీజేపీ సిగ్గుతో తలదించుకోవాలంటున్న కేసీఆర్
By: Tupaki Desk | 28 Feb 2018 1:54 PM GMTతెలంగాణ ముఖ్యమంత్రి - టీఆర్ ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ జాతీయ రాజకీయాలపై దృష్టిసారించారా? తెలంగాణను ప్రాంతీయ పార్టీ ఏలుబడి వేదికగా మాత్రమే ఉంచేందుకు ఆయన జాతీయ పార్టీలపై విరుచుకుపడుతున్నారా? అంటే అవుననే సమాధానం వస్తోంది. వరుసగా రెండు రోజుల పాటు కేసీఆర్ విరుచుకుపడిన తీరు - కేంద్ర ప్రభుత్వం - కాంగ్రెస్ పార్టీపై మండిపడిన విధానం చూస్తే పలువురు ఇదే అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. రైతుల పక్షాన మరోమారు ఆయన కేంద్ర మంత్రిపై విరుచుకుపడ్డారు. రైతు సంక్షోభానికి కాంగ్రెస్ - బీజేపీ ప్రభుత్వాలే కారణమని తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఉద్ఘాటించారు. ఇంకా రైతుల ఓపికను పరీక్షించడం మంచిదికాదని జాతీయపార్టీలకు హితవు పలికారు. అవసరమైతే రైతుల తరఫున తానే ఉద్యమిస్తానని ప్రకటించారు.
`దేశంలో ఏటా 75 వేల టీఎంసీల నీటిని ప్రకృతి ఇస్తే - 24-25వేల టీఎంసీలు మించి వాడుకోవడం లేదు. రెండు జాతీయ పార్టీలు సిగ్గుతో తలదించుకోవాలి. చిల్లర మల్లర మాటలు కాదు. దమ్ముంటే కేసీఆర్ మాటకు జవాబు ఇవ్వాలి. 70 ఏళ్లు గాడిద పండ్లు తోమరా?` అని తనదైన శైలిలో కేసీఆర్ మండిపడ్డారు. `రైతుల ఆత్మహత్యలకు కారకులెవరు? రైతుల పంటలకు మద్దతు ధర ఇస్తే నీ అయ్య సొమ్ము ఏమైనా పోతుందా?` అని నిలదీశారు. ఉద్యోగులకు డీఏ పెంచినట్టు రైతులకు మద్దతు ధర ఎందుకు పెంచరని ప్రశ్నించారు. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో తమ ఎంపీలు రైతు సమస్యలపై నిలదీస్తారని చెప్పారు. `ప్రధానమంత్రికి కూడా చెప్పాను. రైతుల ఓపికను ఇంకా పరీక్షించటం జాతీయ పార్టీలకు క్షేమంకాదు. మీ స్టోరీలను చాలా విన్నారు. అవసరమైతే రైతుల తరఫున నేనే ఉద్యమిస్తా.. రైతాంగాన్ని ఆదుకోవాల్సిన అవసరం ఉంది` అన్నారు
కాగా, సుదీర్ఘకాలంగా ఉన్న సమస్యకు తాను పరిష్కారం చూపానని సీఎం కేసీఆర్ వివరించారు. లోయర్ పెన్ గంగ ప్రాజెక్టు గత ప్రభుత్వాల కాలంలో పెద్ద ఎలక్షన్ డ్రామాగా మారిందని సీఎం విమర్శించారు. `నాటి కాంగ్రెస్ ప్రభుత్వం తెలివితక్కువతనం వల్లే ఐదు దశాబ్దాల కల సాకారంకాలేదు. టీఆర్ ఎస్ ప్రభుత్వం వచ్చాక నేనే స్వయంగా మహారాష్ట్రకు రెండు మూడుసార్లు వెళ్లి ముఖ్యమంత్రిని కలిశా. అక్కడికి మంత్రి హరీశ్ రావును - అధికారులను పంపించాను. నేను - మంత్రులు జోగు రామన్న - ఇంద్రకరణ్ రెడ్డి - ఎంపీ నగేశ్ కలిసి వెళ్లి అక్కడి మంత్రులతో మాట్లాడాం. ఇద్దరికీ ఉపయోగపడేలా సమస్యను పరిష్కరించాం. మీరు బతుకండి.. మమ్మల్ని బతుకనీయండి.. అని కోరాం. వారు ఒప్పుకున్నారు` అని సీఎం వివరించారు.