Begin typing your search above and press return to search.

లాస్ట్ పంచ్ కేసీఆర్..బాబు గుబులు

By:  Tupaki Desk   |   9 April 2019 4:38 AM GMT
లాస్ట్ పంచ్ కేసీఆర్..బాబు గుబులు
X
లాస్ట్ పంచ్ మనదైతే ఆ కిక్కే వేరప్పా.. అన్నట్టుగా కేసీఆర్ చివరి పంచ్ విసిరాడు.. బాబు బ్యాచ్ ను అతలాకుతలం చేసేశాడు. మరి ఎన్నికలకు ఇంకో రెండు రోజుల సమయం మాత్రమే ఉండడం.. ప్రచారానికి నేటి సాయంత్రంతో గడువు ముగిసిపోవడంతో కేసీఆర్ కౌంటర్ జనంలోకి వెళ్లిపోయింది. దీనికి ఎన్ కౌంటర్ ఇద్దామని బాబు ఎంత ప్రయత్నించినా అది సఫలం కాదు.. ఎందుకంటే ఈ రోజు సాయంత్రం 6 గంటల వరకే బాబు బ్యాచ్ ప్రచారం చేయగలదు.. దీన్ని జనంలో వ్యతిరేకించగలదు. కాబట్టి టైం చూసి కేసీఆర్ విసిరిన ఈ బ్రాహ్మస్త్రానికి బాబు బ్యాచ్ ఆందోళన చెందుతోంది.

నిన్న వికారాబాద్ సభలో కేసీఆర్ అదును చూసి టీడీపీపై దాడి చేశాడు. చంద్రబాబు తనను తిడుతున్నాడని.. తాము ఏపీ ప్రత్యేక హోదాకు మద్దతునిస్తున్నామని.. పోలవరంకు కూడా అడ్డుకాదని విస్పష్ట ప్రకటన చేశారు. దీంతో టీడీపీ ఆరోపణలు వట్టి నీటి మూటలని తేలిపోయింది.కేసీఆర్ ప్రకటన ప్రతిపక్ష వైసీపీ వాదానికి బలం చేకూరుస్తూ వెయ్యి ఏనుగుల బలాన్ని ఇచ్చినట్టైంది. వైసీపీ - టీఆర్ ఎస్ ఎంపీలు కలిసి ఢిల్లీలో పార్లమెంట్ లో ఏపీకి హోదా సాధిస్తామని కేసీఆర్ చేసిన ప్రకటన ఇప్పుడు ఏపీ రాజకీయాలను షేక్ చేస్తోంది.

ఇప్పటికే చంద్రబాబు రాత్రి దీన్ని ఖండించాడు. ఇన్నాళ్లు హోదాకు కేసీఆర్ మద్దతివ్వడం లేదని.. పోలవరం అడ్డుకుంటాడని చెప్పిన బాబు సడన్ గా ఇప్పుడు వీటిని అంగీకరించిన కేసీఆర్ కేంద్రానికి లేఖ రాయి అని నాలుక మడతేశాడు. కేసీఆర్ ప్రకటన ఏపీలో వైసీపీకి కొండంత బలంగా మారడంతో టీడీపీ గగ్గోలు పెడుతోంది.

తాజాగా మంగళవారం ఉదయం మంత్రి దేవినేని ఉమ రంగంలోకి దిగి పోలవరం - హోదాపై కేసీఆర్ మద్దతుపై విరుచుకుపడ్డారు. మోడీ - కేసీఆర్ - జగన్ లు ఏపీపై కుట్రలు చేస్తున్నారని ఆడిపోసుకున్నారు..

ఇలా కేసీఆర్ వ్యూహాత్మకంగా చేసిన ప్రకటన ఏపీ పోలింగ్ కు రెండు రోజుల ముందు వైసీపీకి బాగా ప్లస్ అవుతుండగా.. టీడీపీ శిబిరాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. మరి కేసీఆర్ విసిరిన లాస్ట్ పంచ్ ఎన్నికల్లో ఏ మేరకు ప్రభావితం చూపుతుందో చూడాలి మరి..