Begin typing your search above and press return to search.

ఓటేశాక కేసీఆర్ ఏమన్నారో తెలుసా.?

By:  Tupaki Desk   |   7 Dec 2018 7:00 AM GMT
ఓటేశాక కేసీఆర్ ఏమన్నారో తెలుసా.?
X
తెలంగాణలో పవనాలు ఎటో మళ్లాయని చెబుతున్నారని.. కానీ తెలంగాణ పవనాలు ఎప్పుడూ మారలేదని.. టీఆర్ఎస్ ప్రభంజనం సాగుతోందని కేసీఆర్ పేర్కొన్నారు. పెద్దఎత్తున పోలింగ్ తెలంగాణ అంతటా జరుగుతోందని.. సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ చూస్తే ఎవరిది గెలుపో మీకు తెలుస్తుందని కేసీఆర్ అన్నారు. తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ మధ్యాహ్నం తన స్వగ్రామమైన సిద్దిపేట జిల్లా చింతమడకకు వచ్చి ఓటేశారు.

ఓటేసిన అనంతరం మీడియాతో కేసీఆర్ మాట్లాడారు. హైదరాబాద్ లోని పలు చోట్ల యువత, పెద్దవాళ్లు, వృద్ధులు కూడా పెద్దఎత్తున ఓటేసేందుకు పోలింగ్ బూతులకు వచ్చారని.. క్యూలో వందల మంది నిలుచున్నారని.. పెరుగుతున్న ఓటింగ్ సరళి తమ పార్టీకే అనుకూలమన్నారు. ఈసాయంత్రం ఎవరు గెలుస్తారో మీకే తెలుస్తుందంటూ విలేకరులకు వివరించారు. తెలంగాణలో గాలి ఎటూ మళ్లలేదని స్పష్టం చేశారు.

కేసీఆర్ దంపతులు తమ స్వగ్రామమైన చింతమడకలోని ప్రభుత్వ పాఠశాలలోకి సతీసమేతంగా వచ్చారు. చింతమడక పోలింగ్ కేంద్రంలో అధికారులను బూత్ లో సమస్యలపై కేసీఆర్ ఆరా తీశారు. కేసీఆర్ కు ఓటరు స్లిప్పులను అక్కడే ఉన్న మంత్రి హరీష్ రావు అందజేశారు. కేసీఆర్ ఓటు వేసేందుకు ఏర్పాట్లను హరీష్ రావు దగ్గరుండి చూశారు. కాగా కేసీఆర్ చింతమడకలోకి రాగానే ఆయన చిన్న నాటి స్నేహితుడు - మాజీ సర్పంచ్ ను కలుసుకున్నారు. వారి ఇంట్లోనే సరదాగా గడిపేందుకు చింతమడక ఊళ్లోకి వెళ్లారు.