Begin typing your search above and press return to search.
కేసీఆర్ నోట మరో భారీ వరం
By: Tupaki Desk | 14 Dec 2015 6:10 AM GMTగ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ సర్కారు భారీగా తాయిలాలు ప్రకటించేందుకు సిద్ధమైన సంగతి తెలిసిందే. ఇప్పటికే నల్లా బిల్లులు.. కరెంటు బకాయిల్ని రద్దు చేయనున్న సర్కారు.. ఎవరూ ఊహించని భారీ వరాన్ని ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. తాజా వరంతో దాదాపు 2 లక్షలకు పైగా ఓటర్లు గంపగుత్తగా తెలంగాణ అధికారపక్షానికి విధేయులుగా మారిపోతారని భావిస్తున్నారు.
గ్రేటర్ ఎన్నికల్లో భాగంగా ఇప్పటికే నల్లా బకాయిలు.. విద్యుత్తు బకాయిలు లాంటి వరాలతోపాటు.. పేదలు తీసుకునే గృహ రుణాల్ని కూడా రద్దు చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనలో తెలంగాణ అధికారపక్షం ఉంది. ఈ దిశగా కసరత్తు చేసిన సర్కారుకు.. గ్రేటర్ పరిధిలో లబ్థిదారులు 66 వేల వరకు ఉంటారని అంచనా వేసింది.
గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో.. ఈ వరాన్ని ముందుగానే ప్రకటించాలన్న ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో జేఎన్ఎన్ యూఆర్ఎం.. రాజీవ్ గృహకల్పలబ్థిదారులు దాదాపు 56 వేల మంది ఉంటారన్నది ఒక అంచనా. దీనికి తోడుగా వాంబే లబ్థిదారులు మరో 7 వేల వరకు ఉండొచ్చని భావిస్తున్నారు. వీరంతా గృహరుణాల్ని పొంది.. వాటిని తీర్చలేక.. అధికారుల ఒత్తిడితో ప్రైవేటు రుణాలు తీసుకొని నానా ఇబ్బందులు పడుతున్నారు. కొందరికి బ్యాంకుల నుంచి నోటీసులు కూడా అందాయి. రుణాల్ని తీర్చని పక్షంలో ఇళ్లను వేలం వేస్తామని వారు హెచ్చరిస్తున్నారు. దీంతో.. వారంతా తీవ్ర ఒత్తిడిలో ఉన్నారు. తాజాగా.. గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో ఇలాంటి వారి ఆర్థిక ఇబ్బందిని ఒక్క కలంపోటుతో తీసి పారేయాలని కేసీఆర్ సర్కారు ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది.
దీనికి సంబంధించి ఇప్పటికే సూత్రప్రాయంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్న మాట వినిపిస్తోంది. ఒకవేళ ఇదే నిజమై.. గృహరుణాల్ని మాఫీ చేయాలన్న నిర్ణయం కానీ అమలు జరిగితే.. పెద్ద ఎత్తున లబ్థిదారులు అధికారపార్టీకి విధేయులుగా మారటం ఖాయమని చెప్పొచ్చు