Begin typing your search above and press return to search.
ఎంసెట్ 2 రద్ధు...200 మంది తల్లితండ్రులపై చర్యలు!
By: Tupaki Desk | 2 Aug 2016 10:29 AM GMTఎంసెట్ -2.. తెలంగాణలో వేలమంది విద్యార్థులతో పాటు వారి తల్లితండ్రులు సైతం ఎంతో వేదనకు గురిచేసిన ఒక అంశం! ఎంతో ఉత్సాహంగా పరీక్ష రాసి, మంచి మంచి ర్యాంకులు తెచ్చుకున్న ఎంతో మంది, తర్వాత వెలుగులోకి వచ్చిన విషయం తెలుసుకుని షాకయ్యారు. అదే.. ఎంసెట్ 2 పరీక్షా పత్రం లీక్ అయ్యిందని. నాటి నుంచి నేటి వరకూ.. ఎంసెట్ 2 పై రకరకాల కథనాలు - ఊహాగానాలు. రద్దుచేయాలని కొందరు - రద్దువద్దని ఇంకొందరు.. ఎవరి అంచనాలు - ఆశలు ఎలా ఉన్నా.. ఎంసెట్ 2 పరీక్ష పై తెలంగాణ ప్రభుత్వం ఒక క్లారిటీ ఇచ్చింది.
ఎంసెట్ 2 పై నిర్ణయం తీసుకోవడానికి మంగళవారం ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసిన కడియం శ్రీహరి - లక్ష్మారెడ్డి - అధికారులు ఈ వ్యవహారంపై సమీక్ష నిర్వహించారు. అనంతరం మాట్లాడిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. ఎంసెట్ 2 పరీక్షను రద్దుచేస్తున్నట్లు ప్రకటించారు. తప్పనిపరిస్థితుల్లోనే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పిన ఆయన.. పాత హాల్ టిక్కెట్లతోనే పరీక్ష రాసేందుకు అనుమతి ఇవ్వాలని అధికారులకు ఆదేశించారు. ఈ పరీక్షకు సంబందించి కొత్త కన్వీనర్ - కో కన్వీనర్ సభ్యులను నియమించాలని, ఈ పరీక్షకు సంబందించిన కొత్త షెడ్యూల్ ను త్వరగా ప్రకటించాలని అధికారులకు ఆదేశించారు. ఎంసెట్ 3 పరీక్షకు సిద్థమయ్యేలా జేఎన్ టీయూ వెబ్ సైట్ లో స్టడీ మెటీరియల్ - క్వశ్చన్ బ్యాంక్ ఇతర సమాచారం ఉంచాలని సూచించిన కేసీఆర్.. ఈ వ్యవహారాలపై విద్యార్థులు - తల్లితండ్రులు సహృదయంతో సహకరించాలని కోరారు. ఈ పరీక్ష హాల్ టిక్కెట్లను వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు - ఈ పరీక్ష రాసే విద్యార్థులకు ప్రభుత్వం ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించనుంది.
ఇక లీకేజీ వ్యవహారంపై మాట్లాడిన కేసీఆర్... ఎంసెట్ లీకేజీలో 30 మందికే పైగా దోషులు ఉన్నారని - పేపర్ లీకేజీకి కారణమైన వారిలో ఇప్పటికే ఆరుగురిని సీఐడీ అధికారులు అరెస్టు చేసారని - మిగిలిన వారిని కూడా త్వరలో అరెస్ట్ చేస్తారని - బ్రోకర్లు పరీక్షలు రాసిన 200 మంది విద్యార్థుల తల్లిదండ్రులతో సంప్రదింపులు జరిపారని, వారి పైనా చర్యలు తప్పవని తెలిపారు.