Begin typing your search above and press return to search.

మీరు విన్న‌ది ఫేక్‌... ఇది కేసీఆర్ రియ‌ల్ కేబినెట్‌!

By:  Tupaki Desk   |   19 Feb 2019 3:51 PM GMT
మీరు విన్న‌ది ఫేక్‌... ఇది కేసీఆర్ రియ‌ల్ కేబినెట్‌!
X
ఎట్ట‌కేల‌కు... చిట్ట‌చివ‌ర‌కు... రెండు నెల‌ల సుదీర్ఘ కాల‌యాప‌న ఎక్స‌ర్‌ సైజ్ అనంత‌రం కేసీఆర్ మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ చేశారు. నిన్న‌టి నుంచి రాష్ట్రంలో ఇదే హ‌డావుడి న‌డుస్తోంది. పొద్దున నుంచి ర‌క‌ర‌కాల శాఖ‌ల పంప‌కం గురించి అంతా ఫేక్ న్యూస్ ప్ర‌చారంలో ఉంది. అయితే, తాజాగా ఎవ‌రికి ఏ శాఖ ఇచ్చిందీ అధికారికంగా వెలువ‌డింది.

కొత్త‌గా ప్ర‌కటించిన జాబితాలో మంత్రులు వారి శాఖ‌ల లిస్టు ఇది

కేసీఆర్ - ఆర్థిక, రెవెన్యూ, సాగునీటి పారుదల, ఐటీ, పరిశ్రమలు, పట్టాణాభివృద్ధి

కొప్పుల ఈశ్వ‌ర్ - సంక్షేమ శాఖ‌లు (ఉమ్మ‌డిగా)
ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి - న్యాయ‌, అట‌వీ, దేవాదాయ శాఖ‌
ఈట‌ల రాజేంద‌ర్ - వైద్య ఆరోగ్య శాఖ‌
జ‌గ‌దీష్ రెడ్డి - విద్యా శాఖ‌
త‌లసాని శ్రీనివాస్‌ - ప‌శుసంవ‌ర్ధ‌క శాఖ‌

నిరంజ‌న్ రెడ్డి - వ్య‌వ‌సాయ శాఖ‌
ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు - పంచాయ‌తీ రాజ్‌, గ్రామీణాభివృద్ధి
ప్ర‌శాంత్ రెడ్డి - రోడ్లు భ‌వ‌నాలు, ర‌వాణా
మ‌ల్లారెడ్డి - కార్మిక శాఖ‌
శ్రీ‌నివాస్‌ గౌడ్ - ఎక్సైజ్, ప‌ర్యాట‌కం