Begin typing your search above and press return to search.
111 జీవోను ఎత్తేస్తూ కేసీఆర్ క్యాబినెట్ నిర్ణయంతో ఏం కానుంది?
By: Tupaki Desk | 19 May 2023 9:01 AM GMTకొత్త సచివాలయంలో నిర్వహించిన తొలి మంత్రివర్గ సమావేశంలో సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి బోలెడంత ఆదాయాన్ని సమకూర్చేలా.. స్తబ్దుగా ఉన్న రియల్ ఎస్టేట్ రంగం జోరు మీదకు వెళ్లేందుకు వీలైన ట్రిపుల్ వన్ జీవో ను ఎత్తేస్తున్నట్లుగా కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. దీంతో.. ఈ జీవో పరిధిలో ఉండే 84 గ్రామాల్లోని దాదాపు లక్ష ఎకరాల ప్రైవేటు భూమి.. 30 వేల ఎకరాల వరకు ఉన్న ప్రభుత్వ భూమి అందుబాటులోకి వస్తుంది. ఏళ్లకు ఏళ్లుగా సాగుతున్న ఈ జీవోను తొలగించిన ఘనత కేసీఆర్ సర్కారుకు చెల్లుతుంది.
హైదరాబాద్ మహానగరానికి ప్రాణాయువగా నిలిచే జంట జలశయాలు (ఉస్మాన్ సాగర్.. హిమాయత్ సాగర్) పరిరక్షణలో భాగంగా 111 జీవోను తీసుకొస్తారు. దీని కింద ఉన్న భూముల్లో భారీనిర్మాణాలకు అనుమతించరు. అయితే.. మహానగరం భారీగా విస్తరిస్తున్న వేళ.. ట్రిపుల్ వన్ జీవో రియల్ ఎస్టేట్ గ్రోత్ కు అడ్డుగా నిలవటమే కాదు.. భారీ ఎత్తున ల్యాండ్ బ్యాంక్ పరిమితుల్లో ఉండిపోయింది. దీనికి తోడు.. ఇప్పుడు అందుబాటులోకి వచ్చిన ఇరిగేషన్ ప్రాజెక్టుల కారణంగా.. జంట జలాశయాల మీద మహానగరం ఆధారపడాల్సిన అవసరం లేని పరిస్థితి. దీంతో.. ట్రిపుల్ వన్ జీవో పేరుతో ఉన్న నిషేధాలు తాజా మంత్రివర్గ సమావేశం పుణ్యమా అని ఎత్తేసినట్లైంది.
ట్రిపుల్ వన్ జీవోను ఎత్తేయటంతో.. ఐటీ కారిడార్ మరింత విస్తరించే వీలుంది. అదే సమయంలో.. హైదరాబాద్ శివారు అంతకంతకూ విస్తరణకు వెళుతున్న వేళ.. ఆ దూకుడుకు కాసింత బ్రేకులు పడే వీలుంది. ట్రిపుల్ వన్ జీవో పరిధిలో ఉన్న 84 గ్రామాలు రంగారెడ్డి జిల్లా పరిధిలో ఉన్నాయి. ట్రిపుల్ వన్ జీవో మీద బోలెడన్ని కేసులు పెండింగ్ లో ఉన్నాయి. అయినప్పటికీ.. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం సంచలనంగా మారిందని చెప్పాలి.
గ్రేటర్ హైదరాబాద్ విస్తీర్ణం 625 చదరపు కిలోమీటర్లు. ట్రిపుల్ వన్ జీవో పరిధిలో మరో 500 చదరపు కిలోమీటర్ల వరకు ఉంటుంది. మొయినాబాద్.. శంషాబాద్.. షాబాద్.. కొత్తూరు.. రాజేంద్రనగర్.. శంకర్ పల్లి.. చేవెళ్ల మండలాల పరిధిలో 84 గ్రామాల్లో ఏకంగా 1.32 లక్షల ఎకరాల భూమి అందుబాటులో ఉంది. ఇదంతా ఇప్పుడురియల్ ఎస్టేట్ పరిధిలోకి వచ్చేయనుంది. తాజాగా ట్రిపుల్ వన్ జీవోను ఎత్తేసిన నేపథ్యంలో.. రానున్న రోజుల్లో ఇక్కడో మహానగరి ఏర్పాటు కానుందని చెప్పక తప్పదు.
ప్రస్తుతం ఈ ప్రాంతం మొత్తం బయో కనర్జర్వేషన్ జోన్ లో ఉంది. ఇప్పటివరకు 10శాతం భూమినే నిర్మాణాలకు అనుమతి ఉంది. అంటే.. ఎకరం భూమిలో కేవలం పది శాతం మాత్రమే నిర్మాణం చేయాలి. మిగిలిన 90 శాతం భూమిని అలా ఉంచేయాలి. తాజాగా ట్రిపుల్ వన్ జీవో కారణంగా నిర్మాణాలను ఎలాంటి ఆంక్షలు ఉండబోవు. తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ట్రిపుల్ వన్ జీవో ప్రాంతాన్ని హెచ్ ఎండీఏ తన మాస్టర్ ప్లాన్ లో చేర్చటంతో పాటు.. విధి విధానాల్ని సిద్ధం చేస్తుంది. ఇప్పటికిప్పుడు ఈ ప్రాంతంలోని 70వేల ఎకరాల్లో నిర్మాణాలకు భూమి అందుబాటులో ఉందని చెబుతున్నారు. ఇంత భారీగా నిర్మాణాలకు అవకాశం రావటం అంటే.. ఎంత భారీగా లావాదేవీలు జరుగుతాయో అంచనా వేయొచ్చు.
ట్రిఫుల్ వన్ జీవో పరిధిలోని భూములు మొత్తం ఇంతకాలం వ్యవసాయ భూములుగా ఉన్నాయి. ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో నివాస భూములుగా.. ఇతర అవసరాలకు వీలుగా మార్చేందుకు వీలు కలుగుతుంది. హెచ్ఎండీఏ పరిధిలో ఉన్న భూములకు వర్తించే విధివిధానాలే.. ట్రిపుల్ వన్ జీవో పరిధిలో ఉన్న 1.3 లక్షల ఎకరాలకు వర్తిస్తుందని చెప్పటంతో.. రియల్ ఎస్టేట్ బూమ్ ఒక రేంజ్ లో దూసుకెళ్లే వీలుందన్న మాట చెప్పక తప్పదు. ఇటీవల కాలంలో రియల్ రంగం స్తబ్దుగా ఉంది. మాంద్యం పరిస్థితులు దీనికి తోడయ్యాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే.. మహానగరంలో భూమి ధరలు భారీగా పెరిగిపోయాయి. ఇలాంటి వేళ.. మరిక పెరిగే పరిస్థితులు రానున్న నాలుగైదేళ్ల లో లేవన్న పరిస్థితి.
ఇలాంటి వేళలో ట్రిపుల్ వన్ జీవోను ఎత్తేస్తూ క్యాబినెట్ నిర్ణయం తీసుకోవటంతో భారీ ల్యాండ్ బ్యాంక్ వ్యవసాయేతర అవసరాలకు వినియోగించుకునే వీలుంటుంది. ట్రిపుల్ వన్ జీవో ప్రాంతంలో భూముల ధరలు మిగిలిన ప్రాంతాలతో పోలిస్తే తక్కువే. తాజా నిర్ణయంతో భారీ ఎత్తున భూముల కొనుగోళ్లకు వీలుకలుగుతుంది. క్రయవిక్రయాలతో రియల్ జోష్ షురూ కావటమే కాదు.. లక్షలాది మంది మీద ప్రభావం చూపే వీలుందని చెప్పాలి. మొత్తంగా హైదరాబాద్ రియల్ బూమ్ కు గేమ్ ఛేంజర్ గా తాజా నిర్ణయాన్ని చూడాలి. ఈ మొత్తం ఎపిసోడ్ లో ఒకే ఒక్క సందేహం ఏమంటే.. కోర్టులో ఉన్న కేసులకు సంబంధించి ఉన్నత న్యాయస్థానం ఎలా రియాక్టు అవుతుంది? అన్నది మాత్రమే ఉంది.